కాంక్రీట్‌ మిక్సర్‌ ట్రక్కులో కూలీలు

తాజా వార్తలు

Updated : 03/05/2020 18:48 IST

కాంక్రీట్‌ మిక్సర్‌ ట్రక్కులో కూలీలు

ఇండోర్‌: లాక్‌డౌన్‌ నేపథ్యంలో వలస కార్మికులను సొంత గ్రామాలకు పంపేందుకు ఓ వైపు ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నా.. వారు మాత్రం ప్రమాదకరంగా ప్రయాణిస్తూ ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. తాజాగా మహారాష్ట్ర నుంచి ఉత్తర్‌ప్రదేశ్‌కు వలస కూలీలతో వెళ్తున్న కాంక్రీట్‌ మిక్సర్‌ ట్రక్కును శనివారం మధ్యప్రదేశ్‌ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ ట్రక్కులో 18 మంది కూలీలు ఉండడం చూసి అవాక్కయ్యారు. ఇండోర్‌ సమీపంలోని పంత్‌ పిప్లాయ్‌ చెక్‌పోస్టు వద్ద శనివారం ట్రక్కును తనిఖీ చేయగా అసలు విషయం బయటపడింది. 18 మందిలో 14 మంది ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన కూలీలు కాగా.. మిగతా నలుగురూ ట్రక్కు యజమానికి చెందిన వారు. వీరంతా శుక్రవారం రాత్రి మహారాష్ట్ర నుంచి మధ్యప్రదేశ్‌ మీదుగా యూపీకి బయలుదేరారు. వీరిని తరలిస్తున్న లారీ డ్రైవర్‌పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. కూలీలకు వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం వారి స్వస్థలాలకు పంపేందుకు చర్యలు తీసుకుంటామని అధికారులు వెల్లడించారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని