ఏపీ సచివాలయంలో కరోనా కలకలం

తాజా వార్తలు

Published : 04/06/2020 13:50 IST

ఏపీ సచివాలయంలో కరోనా కలకలం

అమరావతి: ఏపీ సచివాలయంలో కరోనా కలకలం రేపుతోంది. తాజాగా సచివాలయంలోని సాధారణ పరిపాలన శాఖలో పనిచేసే ఓ ఉద్యోగికి కొవిడ్‌ నిర్ధారణ కావడంతో ఇతర ఉద్యోగుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. వారం క్రితం వ్యవసాయ శాఖ ఉద్యోగికి కరోనా సోకిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ శాఖ ఉద్యోగులకు వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. ఇదే తరహాలో సచివాలయంలో పనిచేసే ఇతర ఉద్యోగులకు కూడా వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ అమలు చేయాలని ఉద్యోగ సంఘాలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాయి.

కరోనా వైరస్‌ బారిన పడిన వ్యక్తి ఇప్పటికే సచివాలయంలోని అన్ని శాఖల ఉద్యోగులను కలిశారని.. ఎప్పుడు ఎవరికి ఈ వైరస్‌ సోకుతుందో అని భయంగా ఉందని ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సచివాలయానికి ఆనుకుని ఉన్న అసెంబ్లీ గేటు వద్ద భద్రతా విధులు నిర్వహిస్తున్న ఏపీ ఎస్పీ కానిస్టేబుల్‌కు కూడా కరోనా పాజిటివ్‌గా వెల్లడికావడంతో రెండు రోజులుపాటు అసెంబ్లీ సిబ్బంది వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ విధులు నిర్వహించాలని అసెంబ్లీ కార్యదర్శి ఆదేశాలు ఇచ్చారు. మరోవైపు ఇవాళ అసెంబ్లీ ఉద్యోగులకు కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించనున్నారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని