Corona: అప్రమత్తం చేస్తూ.. శానిటైజర్‌ వేస్తూ!
close

తాజా వార్తలు

Published : 16/05/2021 15:18 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Corona: అప్రమత్తం చేస్తూ.. శానిటైజర్‌ వేస్తూ!

పరికరాన్ని రూపొందించిన బీటెక్‌ విద్యార్థి

గాంధీనగర్‌ (కాకినాడ), న్యూస్‌టుడే: తూర్పుగోదావరి జిల్లా కాకినాడకు చెందిన బీటెక్‌ విద్యార్థి భమిడిపాటి హేమంత్‌కుమార్‌ ఆటోమేటిక్‌ హ్యాండ్‌ శానిటైజర్‌, టచ్‌అలర్ట్‌ పరికరాన్ని రూపొందించాడు. దీన్ని ఆన్‌ చేసి చేతికి పెట్టుకున్నాక ఏదైనా వస్తువును తాకేందుకు ప్రయత్నిస్తే సెన్సార్లు అలర్ట్‌ అయి బీప్‌ శబ్దం వస్తుంది. అనవసరంగా ముఖం, ముక్కు, ఇతర వస్తువులను తాకే ప్రయత్నాన్ని విరమించుకోవచ్చు. ఇందులోనే అమర్చిన ప్రత్యేక పైపు ద్వారా అవసరమైనప్పుడు చేతిలోకి శానిటైజర్‌ వస్తుంది. పరికరం తయారీకి కేవలం రూ.300 మాత్రమే ఖర్చయిందని హేమంత్‌ చెప్పాడు. ఓ మోటారు తీసుకొని దానికి బెల్ట్‌ ఏర్పాటుచేసి శానిటైజర్‌ బాటిల్‌కు అమర్చాడు. బటన్‌ నొక్కితే మోటార్‌ తిరిగి శానిటైజర్‌ చేతిలో పడుతుంది. చేతితో ఏదైనా వస్తువును తాకితే ఇందులోని ఐఆర్‌ సెన్సార్ల ద్వారా సంకేతాలు వెలువడి బజర్‌ స్పీకర్‌ మోగడంతోపాటు లైట్‌ వెలుగుతుంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని