Raghurama: ఆర్మీ ఆస్పత్రిలో పరీక్షలకు సుప్రీం ఆదేశం
close

తాజా వార్తలు

Updated : 17/05/2021 16:25 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Raghurama: ఆర్మీ ఆస్పత్రిలో పరీక్షలకు సుప్రీం ఆదేశం

దిల్లీ: ఎంపీ రఘురామరాజుకు సికింద్రాబాద్‌ ఆర్మీ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. దీన్ని జ్యుడిషియల్ కస్టడీగా భావించాలని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. వైద్య పరీక్షల పర్యవేక్షణకు న్యాయాధికారిని తెలంగాణ హైకోర్టు నియమించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. వైద్యపరీక్షలను వీడియో తీయాలని.. నివేదికను సీల్డ్‌ కవర్‌లో అందించాలని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. ఈ ఆదేశాలు అమలయ్యేలా ఏపీ సీఎస్‌ చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. తదుపరి ఆదేశాల వరకు రఘురామను ఆర్మీ ఆస్పత్రిలోనే ఉంచాలని సూచించింది. అనంతరం తదుపరి విచారణను ఈనెల 21కి వాయిదా వేసింది.

రఘురామకృష్ణరాజు బెయిల్‌ పిటిషన్‌తో పాటు ప్రైవేట్‌ ఆస్పత్రిలో వైద్య పరీక్షల అంశంపై సుప్రీంకోర్టులో ఇవాళ వాదనలు జరిగాయి. రఘురామ తరఫున సీనియర్‌ న్యాయవాదులు ముకుల్‌ రోహత్గీ, ఆదినారాయణరావు.. ఏపీ ప్రభుత్వం తరఫున దుష్యంత్‌ దవే, వీవీ గిరి వాదనలు వినిపించారు. ప్రైవేట్‌ ఆస్పత్రిలో కూడా వైద్య పరీక్షలు చేయించాలని కింది కోర్టు ఆదేశించినా అధికారులు ఆ పనిచేయలేదని ముకుల్‌ రోహత్గీ సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. కస్టడీలో రఘురామను తీవ్రంగా కొట్టి హింసించారని.. అరికాళ్లకు తగిలిన గాయాలను ఎంపీ మెజిస్ట్రేట్‌కు చూపించారని తెలిపారు. బెయిల్‌ మంజూరుతో పాటు ప్రైవేట్‌ ఆస్పత్రిలో వైద్యం అందించేందుకు ఆయనకు అవకాశం కల్పించాలని రోహత్గీ కోర్టును కోరారు.  రఘురామ వైద్యపరీక్షలకు విజయవాడ మణిపాల్‌ ఆస్పత్రి ఉందని రాష్ట్ర ప్రభుత్వం తరఫు న్యాయవాది దుష్యంత్‌ దవే తెలిపారు. కేవలం వైద్య పరీక్షలకు మాత్రమే అనుమతివ్వాలని.. ఆస్పత్రిలో అడ్మిషన్‌కు అవకాశం ఇవ్వొద్దని ఆయన కోరారు. అనంతరం విచారణను వాయిదా వేసిన సుప్రీంకోర్టు.. తాజాగా వైద్య పరీక్షలపై ఆదేశాలు జారీచేసింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని