KTR: పట్టణీకరణకు అనుగుణంగా అభివృద్ధి పనులు: కేటీఆర్‌

తాజా వార్తలు

Updated : 06/08/2021 12:54 IST

KTR: పట్టణీకరణకు అనుగుణంగా అభివృద్ధి పనులు: కేటీఆర్‌

ఫతేనగర్‌లో మురుగునీటి శుద్ధీకరణ ప్లాంట్‌కు మంత్రి శంకుస్థాపన

హైదరాబాద్‌: రాష్ట్రంలో పట్టణీకరణకు అనుగుణంగా అభివృద్ధి పనులు చేపడుతున్నామని తెలంగాణ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. ఏటా హైదరాబాద్‌కు లక్షల సంఖ్యలో ప్రజలు వస్తున్నారని.. వారి అవసరాలకు తగిన విధంగా మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నామని తెలిపారు. హైదరాబాద్‌ ఫతేనగర్‌లో రూ.317 కోట్ల వ్యయంతో 100 ఎంఎల్‌డీ సామర్థ్యంతో చేపట్టనున్న మురుగునీటి శుద్ధీకరణ ప్లాంట్‌కు కేటీఆర్‌ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. హైదరాబాద్‌ నగరం ఎంసీహెచ్‌గా ఉన్నప్పుడు కేవలం 160 చ.కి.మీ పరిధి మాత్రమే ఉండేదని.. చుట్టుపక్కల ఉన్న అన్ని మున్సిపాలిటీలతో కలిపి జీహెచ్‌ఎంసీగా ఏర్పాటు చేస్తే దాని వైశాల్యం 625 చ.కి.మీ.కు పెరిగిందన్నారు.

నగర వ్యాప్తంగా రోజుకు 1,950 ఎంఎల్‌డీల మురుగు నీరు ఉత్పత్తి అవుతుంటే దానిలో 772 ఎంఎల్‌డీలను జలమండలి ద్వారా శుద్ధీకరణ చేస్తున్నామన్నారు. గతంలో మంచినీరు, మురుగునీరు పైపులైన్లు కలిసిపోయాయన్నారు. అలా జరగడంతో 9 మంది ప్రాణాలు కోల్పోయారని కేటీఆర్‌ గుర్తు చేశారు. సీవరేజ్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌ (ఎస్‌టీపీ) ద్వారా మురుగునీటిని శుద్ధిచేస్తామన్నారు. ఫతేనగర్‌లో రూ.1280 కోట్ల వ్యయంతో 17 ఎస్‌టీపీలు నిర్మించబోతున్నట్లు మంత్రి చెప్పారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని