Harsh Goenka: ఓటమిని ఎందుకు అంగీకరిస్తున్నారంటే..!

తాజా వార్తలు

Published : 02/07/2021 01:21 IST

 Harsh Goenka: ఓటమిని ఎందుకు అంగీకరిస్తున్నారంటే..!

విశ్లేషించిన వ్యాపావేత్త

ముంబయి: కొన్నిసార్లు మనం ఎంత ప్రయత్నించినా ఆశించిన ఫలితం రాకపోవచ్చు. దాంతో నిరాశ కలగొచ్చు. అప్పుడేం చేయాలి? ఓటమిని అంగీకరించాలా?ఎప్పటికీ ఓటమిని అంగీకరించకుండా ముందుకు వెళ్లాలని చెప్తారు మన పెద్దలు. అయితే అసలు మనం ఓటమిని అంగీకరించాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది? ఆ కారణాలనే విశ్లేషించారు ప్రముఖ వ్యాపారవేత్త హర్షగోయెంకా. థర్స్‌డే థాట్స్‌ హ్యాష్‌ట్యాగ్‌తో వాటిని ట్విటర్‌లో షేర్ చేశారు. 

పనిలో సౌకర్యం చూసుకోవడం
 తప్పుల్ని పట్టుకొని వేలాడుతుండటం
• మార్పునకు సుముఖంగా లేకపోవడం
• ఆత్మవిశ్వాసం కొరవడటం
• నిలకడ లేమి
• మనపై మనకు నమ్మకం లేకపోవడం
• మరింత కృషి చేయడానికి సిద్ధంగా లేకపోవడం
• చేస్తున్న పని నుంచి పక్కదారిపట్టడం
• వెంటనే ఆశించిన ఫలితం రావాలని కోరుకోవడం అంటూ తన అనుభవసారాన్ని వివరించారు. హర్ష చేసిన ట్వీట్‌పై నెటిజన్లు ఏకాభిప్రాయం వ్యక్తం చేశారు. మేం ఓటమిని అంగీకరించమంటూ కొందరు తమ అభిప్రాయాన్ని పంచుకున్నారు. 

 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని