వచ్చేవారంలో ఎంఎంటీఎస్‌ రైళ్లు ప్రారంభం
close

తాజా వార్తలు

Updated : 20/06/2021 16:36 IST

వచ్చేవారంలో ఎంఎంటీఎస్‌ రైళ్లు ప్రారంభం

హైదరాబాద్‌: మహానగరంలో ఎంఎంటీఎస్‌  రైలు సేవలు వచ్చే వారంలో పునః ప్రారంభించాలని రైల్వే మంత్రిత్వశాఖ నిర్ణయించినట్టు  కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి వెల్లడించారు. లాక్‌డౌన్‌తో ఆగిపోయిన ఎంఎంటీఎస్‌ రైళ్లు ఏడాదిన్నర గడిచినా పట్టాలెక్కలేదు. దీంతో చిరువ్యాపారులు, ఉద్యోగులు, కూలీలు అవస్థలు పడుతున్నారు. 5, 10 రూపాయలకే దర్జాగా ప్రయాణించేవారు.. ఇప్పుడు రోజుకు దాదాపు రూ.100 రవాణాకు ఖర్చు చేయాల్సి వస్తోందని వాపోతున్నారు. ఎంఎంటీఎస్‌ రైళ్లు పునః ప్రారంభంతో దిగువ మధ్య తరగతి ప్రజలు, చిరు వ్యాపారులు, విద్యార్థులు, ప్రైవేటు ఉద్యోగులకు అత్యంత చవకైన, సురక్షితమైన రవాణా సదుపాయం కలుగుతుందని కిషన్‌రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు.

కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ ఎంఎంటీఎస్‌ రైళ్లు నడుస్తాయన్నారు. హైదరాబాద్‌ మహానగరంలో ఎంఎంటీఎస్‌ సేవలు పునఃప్రారంభిస్తున్న నేపథ్యంలో ప్రజలు కొవిడ్‌ నియమ నిబంధనల మేరకు తగిన జాగ్రత్తలు పాటిస్తూ ఎంఎంటీఎస్‌ సేవలను ఉపయోగించుకోవాలని కిషన్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. తన విజ్ఞప్తిని మన్నించి ఎంఎంటీఎస్‌ సేవలను పునః ప్రారంభించడానికి అంగీకరించిన కేంద్ర రైల్వేశాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌కు హైదరాబాద్‌ ప్రజల పక్షాన కిషన్‌రెడ్డి ధన్యవాదాలు తెలిపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని