పాలమూరు రంగారెడ్డిపై ఎన్జీటీలో పిటిషన్‌

తాజా వార్తలు

Published : 09/07/2021 13:39 IST

పాలమూరు రంగారెడ్డిపై ఎన్జీటీలో పిటిషన్‌

హైదరాబాద్‌: పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో పర్యావరణ అనుమతుల ఉల్లంఘనలపై ఎన్జీటీ చెన్నై ధర్మాసనం నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. ఆగస్టు 27లోగా నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. పాలమూరు రంగారెడ్డి పథకంలో పర్యావరణ ఉల్లంఘనలు జరిగాయంటూ ముదిరెడ్డిపల్లికి చెందిన వెంకటయ్య అనే వ్యక్తి ఎన్జీటీలో పిటిషన్‌ దాఖలు చేశారు. 

ఉదండాపూర్ రిజర్వాయర్‌కు 16 కిలోమీటర్ల అడ్డుకట్ట నిర్మాణానికి భారీగా చెరువులను తవ్వుతున్నారని ఆరోపించారు. ప్రాజెక్టు నిర్మాణంలో పర్యావరణ నిబంధనలు పాటించడం లేదని పేర్కొన్నారు. కేసుకు విచారణ అర్హత లేదని తెలంగాణ అదనపు అడ్వకేట్ జనరల్ రాంచందర్ రావు వాదించారు. 2016లో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని తాగునీటి ప్రాజెక్టుగా ప్రభుత్వం చేపడితే..ఇప్పుడు కేసు వేయడం నిర్దేశిత లిమిటేషన్ సమయానికి విరుద్ధమని ఏఏజీ వివరించారు.

ఏఏజీ వాదనతో జస్టిస్ రామకృష్ణన్, ఎక్స్ పర్ట్ మెంబర్ సత్యగోపాల్‌తో కూడిన ఎన్జీటీ ధర్మాసనం ఏకీభవించలేదు. పిటిషనర్ ప్రాజెక్టును సవాలు చేయడం లేదని, పర్యావరణ ఉల్లంఘనలపై కేసు దాఖలు చేశారని తెలిపింది. కేసును స్వీకరిస్తూ.. కేంద్ర పర్యావరణ శాఖ, తెలంగాణ సాగునీటి శాఖ, మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ఎస్ఈ, గనుల శాఖ మహబూబ్ నగర్ జిల్లా అసిస్టెంట్ డైరెక్టర్లకు నోటీసులు జారీ చేసింది. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం తెలంగాణ ప్రభుత్వానికి ప్రతిష్ఠాత్మకమైనందువల్ల కమిటీని సమన్వయం చేసే బాధ్యతను కేంద్ర పర్యావరణ శాఖకు ఇవ్వాలని పిటిషనర్‌ తరఫు న్యాయవాది కోరారు. కేసు తదుపరి విచారణను ఏన్జీటీ ఆగస్టు 27కి వాయిదా వేసింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని