శాప్‌ మాజీ ఛైర్మన్‌ పీఆర్‌ మోహన్‌ కన్నుమూత

తాజా వార్తలు

Updated : 12/07/2021 10:23 IST

శాప్‌ మాజీ ఛైర్మన్‌ పీఆర్‌ మోహన్‌ కన్నుమూత

శ్రీకాళహస్తి: శాప్‌ మాజీ ఛైర్మన్‌, తెదేపా నేత పీఆర్‌ మోహన్‌ కన్నుమూశారు. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలోని నివాసంలో గుండెపోటుతో ఈ ఉదయం ఆయన మృతిచెందారు. ఎన్టీఆర్‌ వీరాభిమానిగా 1983లో ఆయన తెదేపాలో చేరారు. న్యాయవాదిగా ఉంటూ తెదేపాలో క్రియాశీలకంగా వ్యవహరించారు. 1984లో పీఆర్‌ను శ్రీకాళహస్తి ఆలయ ట్రస్టు బోర్డు ఛైర్మన్‌గా ఎన్టీఆర్‌ నియమించారు. 1994, 2014లో రెండు సార్లు శాప్‌ ఛైర్మన్‌గా పని చేశారు.

పీఆర్‌ మృతి పట్ల చంద్రబాబు, లోకేశ్ సంతాపం

పీఆర్‌ మోహన్‌ మృతి పట్ల తెదేపా అధినేత చంద్రబాబు, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ సంతాపం వ్యక్తం చేశారు. పీఆర్‌ మోహన్‌ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. తెదేపా ఆవిర్భావం నుంచి మోహన్‌ సేవలు వెలకట్టలేనివి అని చంద్రబాబు అన్నారు. ఎన్టీఆర్‌తో ఆయన అనుబంధం మాటల్లో చెప్పలేనిదని వివరించారు. తన పాదయాత్ర విజయవంతానికి ఎంతో కృషి చేశారని కొనియాడారు. శాప్‌ ఛైర్మన్‌గా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించారన్నారు. మోహన్‌ పార్టీ పట్ల అంకితభావంతో పని చేశారని లోకేశ్‌ అన్నారు. అతని మృతి పార్టీకి తీరని లోటని చెప్పారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని