ఎస్‌ఈసీగా మరోసారి నిమ్మగడ్డ బాధ్యతలు..

తాజా వార్తలు

Updated : 03/08/2020 12:22 IST

ఎస్‌ఈసీగా మరోసారి నిమ్మగడ్డ బాధ్యతలు..

అమరావతి : రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ మరోసారి బాధ్యతలు స్వీకరించారు. హైకోర్టు ఆదేశాలతో ఇటీవలే నిమ్మగడ్డను ప్రభుత్వం పునర్నియమించిన విషయం తెలిసిందే. గవర్నర్‌ నోటిఫికేషన్‌ మేరకు శుక్రవారమే హైదరాబాద్‌లో బాధ్యతలు చేపట్టినట్లు రమేశ్‌కుమార్‌ తెలిపారు. తాను బాధ్యతలు చేపట్టినట్లు కలెక్టర్లు, సంబంధిత అధికారులకు సమాచారమిచ్చినట్లు చెప్పారు. ఎన్నికల సంఘం కార్యదర్శి వాణీమోహన్‌ ద్వారా వీరికి సమాచారమందించినట్లు తెలిపారు. బాధ్యతల నిర్వహణకు ఇవాళ విజయవాడలోని కార్యాలయానికి వచ్చినట్లు పేర్కొన్నారు.

‘ఈసీ అనేది స్వతంత్ర రాజ్యాంగ వ్యవస్థ. రాగద్వేషాలకు అతీతంగా ఎన్నికల కమిషన్‌ వ్యవహరిస్తుంది. విధుల నిర్వహణలో రాష్ట్ర ప్రభుత్వ సహకారం లభిస్తుందని ఆశిస్తున్నా. గతంలో మాదిరిగానే ప్రభుత్వ సహకారం ఉంటుందని అనుకుంటున్నా’ అని ఎస్‌ఈసీ రమేశ్‌కుమార్‌ అన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని