Mamata Banerjee:టీకా పొందినవారికే రెస్టారెంట్‌లో పని!
close

తాజా వార్తలు

Published : 03/06/2021 19:15 IST

Mamata Banerjee:టీకా పొందినవారికే రెస్టారెంట్‌లో పని!

 పశ్చిమ్‌బెంగాల్‌ సీఎం మమతాబెనర్జీ

కోల్‌కతా: లాక్‌డౌన్‌ వేళ రెస్టారెంట్లను సాయంత్రం 5 నుంచి రాత్రి 8 గంటల వరకు మాత్రమే నిర్వహించాలని పశ్చిమ్‌బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ పేర్కొన్నారు. ఈ సందర్భంగా రాష్ర్ట సెక్రటేరియట్‌ ఏర్పాటు చేసిన సమావేశంలో పలు రంగాలకు చెందిన ప్రతినిధులతో మమత చర్చించారు. ‘‘రెస్టారెంట్లో సిబ్బంది అంతా కచ్చితంగా వ్యాక్సిన్‌ వేయించుకుని కొవిడ్‌ నిబంధనలు పాటించాలి. హోటల్స్‌ మూసివేయాలన్న ఆలోచన ప్రభుత్వానికి లేదు. కష్టకాలంలోనూ వ్యాపారాలు పుంజుకోవాలి. అందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. హోటల్‌ రంగాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ మినహాయింపులు ఇస్తున్నాం. కరోనా వ్యాప్తిని నియంత్రిస్తూ.. ఇంకోవేవ్‌ రాకుండా జాగ్రత్తపడాలి. అందుకే ఫుడ్‌ డెలివరీ మీద దృష్టి పెట్టాం’’ అని అన్నారు. కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో చిల్లర దుకాణాలకు, పదిశాతం ఉద్యోగులతో సాఫ్ట్‌వేర్‌ కార్యాలయాలకు మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 3 గంటల వరకు అనుమతినిచ్చారు. కార్మికులందరికీ టీకాలు వేసిన తర్వాత నిర్మాణ కార్యకలాపాల్లో పాల్గొనవచ్చని చెప్పారు. కాగా బెంగాల్‌ ప్రభుత్వం జూన్‌ 15 వరకు లాక్‌డౌన్‌ విధించింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని