Sangam dairy: డైరెక్టర్‌కు జైలులో కరోనా

తాజా వార్తలు

Updated : 04/05/2021 11:16 IST

Sangam dairy: డైరెక్టర్‌కు జైలులో కరోనా

రాజమహేంద్రవరం జైలు సూపరింటెండెంట్‌ ప్రకటన

రాజమహేంద్రవరం: సంగం డెయిరీలో అక్రమాలకు పాల్పడ్డారనే అభియోగాలతో రాజమహేంద్రవరం జైలులో ఉన్న డెయిరీ డైరెక్టర్‌ గోపాలకృష్ణన్‌కు కరోనా నిర్ధరణ అయినట్లు జైలు సూపరింటెండెంట్‌ రాజారావు తెలిపారు. దీంతో ఆయనకు రాజమహేంద్రవరం ప్రభుత్వ కొవిడ్‌ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. సోమవారం మధ్యాహ్నం గోపాలకృష్ణన్‌కు కొవిడ్‌ లక్షణాలు బయటపడ్డాయి. శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది కలగడంతో జైలు అధికారులు నిన్న రాత్రి పరీక్షలు చేయించగా.. పాజిటివ్‌గా నిర్ధరణ అయింది. ఈయనతో పాటు ఇదే అభియోగాలతో జైలులో ఉన్న గురునాథంతో పాటు ధూళిపాళ్ల నరేంద్రకు కూడా ఇవాళ పరీక్షలు చేయిస్తామని జైలు సూపరింటెండెంట్‌ తెలిపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని