TS NEWS: మరో 6 ఆసుపత్రులపై వేటు

తాజా వార్తలు

Updated : 02/06/2021 13:06 IST

TS NEWS: మరో 6 ఆసుపత్రులపై వేటు

హైదరాబాద్‌: కొవిడ్‌ రోగుల నుంచి భారీగా ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేటు ఆసుపత్రులపై ప్రభుత్వం కొరడా ఝుళిపించింది. ఇప్పటికే పలు ఆసుపత్రుల కొవిడ్‌ లైసెన్స్‌ రద్దు చేయగా.. తాజాగా మరో ఆరు ఆసుపత్రులపై వేటు పడింది. సికింద్రాబాద్‌ కిమ్స్‌, గచ్చిబౌలిలోని సన్‌షైన్‌, బంజారాహిల్స్‌లోని సెంచరీ‌, లక్డికాపూల్‌లోని లోటస్‌, ఎల్‌బీ నగర్‌లోని మెడిసిస్‌, టోలిచౌక్‌లోని ఇంటెగ్రో ఆసుపత్రుల కొవిడ్‌ లైసెన్స్‌ రద్దు చేసినట్టు వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. 

కొత్తగా కొవిడ్‌ రోగులను చేర్చుకోవడానికి వీల్లేదని స్పష్టం చేసింది. ఇప్పటికే ఉన్నవారికి ప్రొటోకాల్‌ ప్రకారం చికిత్స అందించాలని చెప్పింది. ఆదేశాలను అమలు చేయకపోతే ఆసుపత్రి లైసెన్సులను రద్దు చేయక తప్పదని ప్రజారోగ్య సంచాలకుడు(డీహెచ్‌) జారీ చేసిన ఆదేశాల్లో పేర్కొన్నారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరల కన్నా ఎక్కువ వసూలు చేస్తున్నాయని, కొన్ని ఆసుపత్రులు రోజుకు లక్ష వరకు  తీసుకుంటున్నాయని ఆయా ఆసుపత్రులపై ఫిర్యాదులు అందిన విషయం తెలిసిందే.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని