Lockdown: రోడ్లపైకి వస్తే వాహనాలు సీజ్‌: డీజీపీ

తాజా వార్తలు

Published : 22/05/2021 18:42 IST

Lockdown: రోడ్లపైకి వస్తే వాహనాలు సీజ్‌: డీజీపీ

లాక్‌డౌన్‌ తర్వాతే ఇస్తామని మహేందర్‌రెడ్డి హెచ్చరిక

హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాల మేరకు హైదరాబాద్‌లో పోలీసులు లాక్‌డౌన్‌ను మరింత కఠినంగా అమలుచేస్తున్నారు. లాక్‌డౌన్‌ సమయంలో ప్రజలు సహకరించాలని డీజీపీ మహేందర్‌ రెడ్డి విజ్ఞప్తి చేశారు. లాక్‌డౌన్‌ అమలులో ఉన్నప్పుడు రోడ్లపైకివస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అత్యవసర వాహనాలకు ప్రతి చెక్‌ పోస్ట్‌ వద్ద ప్రత్యేక లైను ఉంటుందని చెప్పారు. కొందరు రోడ్లపైకి రావడంతోనే కరోనావ్యాప్తిచెందుతోందన్నారు. ఏ అవసరం ఉన్నా ఉదయం 6గంటల నుంచి 10గంటల వరకే బయటకు రావాలన్నారు. ఉదయం 6 నుంచి 10గంటల వరకే ఈ-కామర్స్‌ సేవలు అందుబాటులో ఉంటాయని స్పష్టంచేశారు. 

మరోవైపు, ఇప్పటికే పోలీసులు ఉదయం 10గంటల తర్వాత అనవసరంగా రోడ్లపైకి వచ్చే వాహనాలను సీజ్‌ చేస్తున్నారు. పాస్‌లు ఉన్న వాహనాలకు మాత్రమే అనుమతిస్తూ.. లేనివారిపై కేసులు నమోదుచేసి లాఠీలు ఝళిపిస్తున్నారు.ఈసీఐఎల్‌ చౌరస్తాలో డీజీపీ మహేందర్‌ రెడ్డి పర్యటించి.. ఉదయం 9.30గంటల నుంచే దుకాణాలు మూసివేయాలని యజమానులకు సూచించారు. అనుమతిలేకుండా రోడ్లపైకి వచ్చేవారి వాహనాలు సీజ్‌ చేసి లాక్‌డౌన్‌ పూర్తయ్యే వరకు ఇచ్చే ప్రసక్తే లేదని స్పష్టంచేశారు. ఉదయం 10గంటల తర్వాత నగరంలోకి వచ్చే రహదారులను మూసివేస్తామని తెలిపారు. 

సరకు రవాణా వాహనాలకు రాత్రి 9గంటల నుంచి ఉదయం 9గంటల వరకే అనుమతి ఉంటుందని వెల్లడించారు. ఎట్టిపరిస్థితుల్లో 10 తర్వాత రోడ్లపైకి రావొద్దని హెచ్చరించారు. సరకు రవాణా వాహనాలు ఉదయమే కార్యకలాపాలు కొనసాగించాలన్న ఉన్నతాధికారుల ఆదేశాలతో చెక్‌పోస్టుల వద్ద పోలీసులు వాహనాలను వెనక్కి పంపుతున్నారు.  రాచకొండ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలోని పలు ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ అమలును సీపీ మహేశ్‌ భగవత్‌ పరిశీలించారు. షాపూర్‌నగర్‌ చెక్‌ పోస్టు వద్ద బాలానగర్‌ డీసీపీ పద్మజ తనిఖీలు చేపట్టి సరకు రవాణా వాహనాలను తిప్పిపంపుతున్నారు.

లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘిస్తున్న వారిపై పోలీసులు లాఠీలు ఝుళిపిస్తున్నారు. ప్రతిఒక్కరి అనుమతి పత్రాలు, ఈ-పాస్‌లను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. అనుమతిలేని వాహనాలను సీజ్‌ చేసి జరిమానాలు విధిస్తున్నారు. ఎంజే మార్కెట్‌లో రద్దీ తగ్గకపోవడంతో పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. వాహనదారులు పోలీసులతో వాగ్వాదానికి దిగడంతో స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. బేగం బజార్‌లో అనవసరంగా బయటకు వచ్చిన వాహనాలను సీజ్‌ చేసి గోషామహల్‌ స్టేడియానికి తరలించారు. పాస్‌లు దుర్వినియోగం చేసిన వారిపై కఠిన చర్యలుతీసుకుంటామని హెచ్చరించారు. అత్యవసర, ప్రభుత్వ ఉద్యోగులను మాత్రమే అనుమతిస్తున్నారు. చిక్కడ్‌పల్లి, ముషీరాబాద్‌, గాంధీనగర్‌ పరిధిలో తనిఖీలు చేసి 300లకు పైగా ద్విచక్రవాహనాలు, కార్లు, ఆటోలు సీజ్‌ చేసి 400లకు పైగా కేసులు నమోదు చేసినట్టు పోలీసులు వెల్లడించారు.రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం వద్ద సాగర్‌ రహదారులపై చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. 

మరోవైపు, జిల్లాల్లోనూ కఠినంగా లాక్‌డౌన్‌ అమలవుతోంది. ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షిస్తును్నారు. నిబంధనలు మీరి ఎవరు బయటకు వచ్చినావాహనాలు సీజ్‌ చేస్తున్నారు. ప్రభుత్వ మార్గదర్శకాలు పాటించకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. లాక్‌డౌన్‌ పక్కాగా అమలు చేసేందుకు పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని