ఇంటర్‌ కళాశాలల అనుబంధ గుర్తింపునకు నోటిఫికేషన్‌
close

తాజా వార్తలు

Updated : 07/05/2021 21:18 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఇంటర్‌ కళాశాలల అనుబంధ గుర్తింపునకు నోటిఫికేషన్‌

హైదరాబాద్: తెలంగాణలోని జూనియర్ కళాశాలల అనుబంధ గుర్తింపు ప్రక్రియ కోసం ఇంటర్ బోర్డు నోటిఫికేషన్ జారీ చేసింది. ఈనెల 12 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని ఇంటర్ బోర్డు కార్యదర్శి ఒమర్ జలీల్ తెలిపారు. అనుబంధ గుర్తింపు పొడిగింపు, అదనపు సెక్షన్లతో పాటు కళాశాలను మరో ప్రాంతానికి తరలించడానికి అనుమతి కోసం దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. గుర్తింపు కోసం అగ్నిమాపక శాఖ ధ్రువపత్రంతో పాటు నిబంధనలకు అనుగుణంగా దస్త్రాలు సమర్పించాలని తెలిపారు. ఈనెల 24వ తేదీలోగా దరఖాస్తులు సమర్పించాలని.. రూ. 1000 నుంచి 20వేల వరకు ఆలస్య రుసుంతో జులై 5 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. గుర్తింపు పొందిన కళాశాలల వివరాలను విద్యార్థులు, తల్లిదండ్రులకు వీలైనంత ముందుగా ఇవ్వాల్సి ఉన్నందున.. జులై 5 తర్వాత సమర్పించే దరఖాస్తులను పరిశీలించబోమని ఇంటర్ బోర్డు కార్యదర్శి స్పష్టం చేశారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని