డాక్టర్‌ రఘురాంకు ప్రతిష్ఠాత్మక ఫెలోషిప్‌

తాజా వార్తలు

Updated : 21/07/2021 08:43 IST

డాక్టర్‌ రఘురాంకు ప్రతిష్ఠాత్మక ఫెలోషిప్‌

ఈనాడు, హైదరాబాద్‌: ప్రముఖ శస్త్రచికిత్స నిపుణులు, కిమ్స్‌ ఉషాలక్ష్మీ రొమ్ము వ్యాధుల చికిత్స కేంద్రం డైరెక్టర్‌ డాక్టర్‌ పి.రఘురాంను ప్రతిష్ఠాత్మక పురస్కారం వరించింది. బ్రిటన్‌, ఐర్లాండ్‌లలో అత్యంత ప్రసిద్ధి చెందిన సర్జన్ల సంస్థ ఏఎస్‌జీబీఐ (అసోసియేషన్‌ ఆఫ్‌ సర్జన్స్‌ ఆఫ్‌ గ్రేట్‌ బ్రిటన్‌ అండ్‌ ఐర్లాండ్‌).. గౌరవ సభ్యత్వం (ఫెలోషిప్‌)తో సత్కరించింది. మంగళవారం ఆన్‌లైన్‌ వేదికగా నిర్వహించిన కార్యక్రమంలో ఏఎస్‌జీబీఐ అధ్యక్షుడు నీల్‌ వెల్క్‌.. డాక్టర్‌ పి.రఘురాంకు ఈ గౌరవ సభ్యత్వం అందజేశారు. వందేళ్ల కిందట స్థాపించిన ఈ సంస్థలో ఇప్పటివరకూ ఒక్క భారతీయ వైద్యుడికి కూడా  ఫెలోషిప్‌ లభించలేదు. డాక్టర్‌ రఘురాం ఈ ఘనత సాధించిన తొలి భారతీయ శస్త్రచికిత్స నిపుణుడిగా గుర్తింపు పొందారు. భారత్‌లో మెరుగైన వైద్యసేవలు అందించడంతో పాటు.. భారత్‌, యూకే మధ్య వైద్య పరిజ్ఞాన మార్పిడిలో వారధిగా వ్యవహరిస్తున్నందుకు గుర్తింపుగా రఘురాంకు ఈ పురస్కారం అందజేసినట్లు ఏఎస్‌జీబీఐ తెలిపింది. ఈ పురస్కారం సమాజం పట్ల తన బాధ్యతలను మరింతగా పెంచిందని డాక్టర్‌ రఘురాం పేర్కొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని