krishna floods: శ్రీశైలం జలాశయానికి భారీగా వరద

తాజా వార్తలు

Published : 25/07/2021 20:35 IST

krishna floods: శ్రీశైలం జలాశయానికి భారీగా వరద

శ్రీశైలం: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఆల్మట్టి నుంచి కృష్ణమ్మ శ్రీశైలం వైపు పరుగులు పెడుతోంది. దీంతో జూరాల జలాశయానికి భారీగా వరదనీరు చేరుతోంది. జూరాలకు 3.94 లక్షల క్యూసెక్కుల వరద వస్తుండగా 4.06 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. జూరాల పూర్తిస్థాయి నీటిమట్టం 318.516 మీటర్లకు గాను ప్రస్తుతం 316.607 మీటర్ల నీటిమట్టం ఉంది. జూరాల నీటి నిల్వ సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా.. ప్రస్తుత నీటి నిల్వ 6.20 టీఎంసీలుగా ఉంది.

శ్రీశైలం జలాశయానికి 4.5 లక్షల క్యూసెక్కులకుపైగా వరదనీరు వచ్చి చేరుతోంది. శ్రీశైలం ప్రాజెక్టు గరిష్ఠ నీటిమట్టం 885 అడుగులకు గాను ప్రస్తుతం 863.7 అడుగులకు చేరింది. గరిష్ఠ నీటినిల్వ 215.8 టీఎంసీలుగా కాగా ప్రస్తుతం 117.77 టీఎంసీలుగా ఉంది. ఎడమగట్టు జల విద్యుత్‌ కేంద్రంలో విద్యుత్‌ ఉత్పత్తి కొనసాగుతోంది. విద్యుత్‌ ఉత్పత్తి ద్వారా 31వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు.

ప్రకాశం బ్యారేజ్‌ వద్ద తగ్గుతున్న వరద

విజయవాడ ప్రకాశం బ్యారేజ్‌ వద్ద వరద ఉద్ధృతి తగ్గుతోంది. ప్రకాశం బ్యారేజ్‌ ఇన్‌ఫ్లో 50,840 క్యూసెక్కులు, అవుట్‌ఫ్లో 51,940 క్యూసెక్కులుగా ఉంది. బ్యారేజ్‌ నుంచి కాలువలకు 3,631 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. బ్యారేజ్‌ 70 గేట్లు అడుగు మేరకు ఎత్తి దిగువకు నీరు విడుదల చేస్తున్నారు.

తుంగభద్రకు భారీగా వరద

తుంగభద్ర జలాశయానికి భారీగా వరదనీరు వస్తుండటతో పూర్తిగా నిండిపోయింది. దీంతో జలాశయం నాలుగు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. నాలుగు గేట్ల ద్వారా సుమారు 20వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. తుంగభద్ర నుంచి హెచ్‌ఎల్‌సీకి వెయ్యి క్యూసెక్కుల నీటిని విడుదల చేశామని అధికారులు తెలిపారు. రాయదుర్గం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ కాపు రామచంద్రారెడ్డి దంపతులు పూర్ణకుంభంతో తుంగభద్ర జలాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని