Saidabad: నిందితుడు పశ్చాతాపంతో ఆత్మహత్య చేసుకున్నాడు: సత్యవతి రాథోడ్

తాజా వార్తలు

Published : 16/09/2021 13:15 IST

Saidabad: నిందితుడు పశ్చాతాపంతో ఆత్మహత్య చేసుకున్నాడు: సత్యవతి రాథోడ్

హైదరాబాద్‌: నగరంలోని సైదాబాద్‌ సింగరేణి కాలనీలో బాలిక హత్యాచారం ఘటనలో నిందితుడైన రాజు ఆత్మహత్య చేసుకోవడంతో మంత్రి సత్యవతి రాథోడ్‌ స్పందించారు. నిందితుడిగా ఉన్న రాజు పశ్చాతాపంతో ఆత్మహత్య చేసుకున్నాడన్నారు. చిన్నారి ఆత్మకు శాంతి చేకూరుతుందని ఆకాంక్షించారు. ఇవాళ ఉదయం బాధిత కుటుంబాన్ని మంత్రి మహమూద్‌ అలీలో కలిసి పరామర్శించినట్లు తెలిపారు. ఆ కుటుంబానికి ప్రభుత్వ పరంగా న్యాయం చేస్తామని సత్యవతి రాథోడ్‌ వివరించారు. స్టేషన్‌ఘన్‌పూర్‌కు సమీపంలోని రైలు పట్టాలపై నిందితుడు రాజు మృతదేహాన్ని ఈ ఉదయం గుర్తించిన విషయం తెలిసిందే.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని