Amaravati News: అమరావతి ఐకాస ర్యాలీకి అనుమతిలేదు: గుంటూరు ఐజీ

తాజా వార్తలు

Updated : 07/08/2021 20:39 IST

Amaravati News: అమరావతి ఐకాస ర్యాలీకి అనుమతిలేదు: గుంటూరు ఐజీ

అమరావతి: రాజధాని రైతుల ఉద్యమం 600 రోజులకు చేరిన సందర్భంగా అమరావతి ఐకాస రేపు తలపెట్టిన ర్యాలీకి అనుమతి లేదని గుంటూరు రేంజ్‌ ఐజీ త్రివిక్రమవర్మ తెలిపారు. కొవిడ్‌ దృష్ట్యా ర్యాలీకి అనుమతి సాధ్యం కాదని స్పష్టం చేశారు. అదే సమయంలో 3 రాజధానులకు మద్దతుగా బహుజన పరిరక్షణ సమితి ర్యాలీకి కూడా అనుమతి ఇవ్వలేదన్నారు. జాతీయ విపత్తు నిర్వహణ చట్టం అమల్లో ఉన్నందున 50 మంది కంటే ఎక్కువ మంది పాల్గొనే కార్యక్రమాలకు అనుమతి ఇవ్వలేమని తేల్చి చెప్పారు. రెండు వర్గాలు ప్రదర్శనలు నిర్వహిస్తే శాంతిభద్రతల సమస్య కూడా తలెత్తే అవకాశం ఉందన్నారు. గొడవలు జరిగే అవకాశం ఉందని నిఘావర్గాల నుంచి సమాచారం వచ్చినట్టు చెప్పారు. అందుకే ఎట్టి పరిస్థితుల్లో ఎవరికీ అనుమతి సాధ్యం కాదన్నారు. ఎవరికి వారు తమ శిబిరాల్లో నిరసన కార్యక్రమాలు చేసుకోవాలని సూచించారు.  నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

గుంటూరు గ్రామీణ ఎస్పీ విశాల్‌ గున్నీ మాట్లాడుతూ.... అమరావతి ఐకాస నేతలు న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు ర్యాలీ కోసం అనుమతి అడిగినట్టు చెప్పారు. కొవిడ్‌ దృష్ట్యా బహిరంగ ర్యాలీలకు అనుమతి ఇవ్వలేదన్నారు. హైకోర్టు వంటి కీలక ప్రాంతాల నుంచి ర్యాలీ ప్రారంభించాలనుకోవడం సరికాదని వ్యాఖ్యానించారు.
 గుంటూరు అర్బన్‌ ఎస్పీ ఆరీఫ్‌ మాట్లాడుతూ... బయటి ప్రాంతాల నుంచి వచ్చి ఎవరైనా ఆందోళన చేయాలని చూస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని