Rahul Ganhdi: మీకంటే ముందే రాహుల్‌ను చూశాను.. కేరళ నర్సు భావోద్వేగం

తాజా వార్తలు

Updated : 19/08/2021 04:07 IST

Rahul Ganhdi: మీకంటే ముందే రాహుల్‌ను చూశాను.. కేరళ నర్సు భావోద్వేగం

వయనాడ్‌: ‘‘రాహుల్‌ గాంధీని మీ అందరికంటే ముందే నేను చూశాను తెలుసా..!’’ అంటూ ఉప్పొంగిపోయారు కేరళకు చెందిన నర్సు రాజమ్మ వవతిల్‌. 50ఏళ్ల క్రితం ఆమె దిల్లీలోని హోలీ ఫ్యామిలీ హాస్పిటల్‌లో నర్సుగా పనిచేసేవారు. అక్కడే 1970 జూన్‌ 19న రాహుల్‌ జన్మించారు. ఆసుపత్రిలో ఆయనను చూసుకున్నవారిలో రాజమ్మ కూడా ఒకరు. తాజాగా రాహుల్‌ వయనాడ్‌కు వచ్చారని తెలిసి ఆయనను కలిశారు. 

‘‘ఈయన నాకు కొడుకు లాంటివారు. నా కళ్ల ముందే పుట్టారు. మీ అందరి కంటే ముందే నేను ఈయనను చూశాను’’ అంటూ రాహుల్‌ భద్రతా సిబ్బందికి చెబుతూ సంతోషపడ్డారు. అమ్మ(సోనియాగాంధీ), చెల్లి(ప్రియాంక గాంధీ) ఎలా ఉన్నారంటూ రాహుల్‌ను కుశల ప్రశ్నలు అడిగారు. ఆయనకు ప్రత్యేకంగా స్వీటు బాక్సు తీసుకొచ్చి ఇచ్చారు. ఆ తర్వాత ‘మీకు అసౌకర్యం కలిగించినందుకు క్షమించాలి’ అని అనగా.. అలాంటిదేమీ లేదంటూ రాహుల్‌ ఆమెను ఆప్యాయంగా దగ్గరకు తీసుకున్నారు. ఈ వీడియోను కేరళ కాంగ్రెస్‌ తన ట్విటర్‌ ఖాతాలో షేర్‌ చేసింది.  

రెండు రోజుల పర్యటన నిమిత్తం రాహుల్‌ సోమవారం వయనాడ్‌ వెళ్లారు. నిన్న కొంత మంది విద్యార్థులతో ముచ్చటించారు. మలప్పురంలోని గాంధీ భవన్‌ స్నేహరామమ్‌లో వృద్ధులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. 



Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని