Covid: చిత్తూరు జిల్లాలో 17మంది ఉపాధ్యాయులు.. 10 మంది విద్యార్థులకు కొవిడ్ పాజిటివ్‌

తాజా వార్తలు

Updated : 24/08/2021 19:45 IST

Covid: చిత్తూరు జిల్లాలో 17మంది ఉపాధ్యాయులు.. 10 మంది విద్యార్థులకు కొవిడ్ పాజిటివ్‌

చిత్తూరు విద్యా విభాగం: ఆంధ్రప్రదేశ్‌లో పాఠశాలలు పునఃప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు 17మంది ఉపాధ్యాయులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. వీరితోపాటు 10 మంది విద్యార్థులూ వైరస్‌ బారినపడ్డారు. పాఠశాలలు ప్రారంభమైన తొలిరోజైన ఈ నెల 16న ముగ్గురు ఉపాధ్యాయులు, 17న ఒకరికి, 19న ఆరుగురికి, 21న ముగ్గురు ఉపాధ్యాయులు, ఇద్దరు విద్యార్థులకు కొవిడ్ నిర్ధారణ అయ్యింది. 23న ముగ్గురు ఉపాధ్యాయులు, ఏడుగురు విద్యార్థులకు, 24న ఒక ఉపాధ్యాయుడు.. ఒక విద్యార్థికి కరోనా సోకినట్లు తెలిసింది. పాఠశాలల్లో కొవిడ్‌ కేసులు రోజురోజుకీ పెరిగిపోతుండటంతో విద్యార్థులను బడికి పంపించేందుకు తల్లిదండ్రులు సుముఖత చూపడం లేదు. దీంతో హాజరుశాతం గణనీయంగా పడిపోతోంది.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని