KTR: అంకురాల కోసం ప్రత్యేకంగా ‘స్టార్టప్ తెలంగాణ పోర్టల్’: కేటీఆర్

తాజా వార్తలు

Updated : 16/09/2021 21:41 IST

KTR: అంకురాల కోసం ప్రత్యేకంగా ‘స్టార్టప్ తెలంగాణ పోర్టల్’: కేటీఆర్

హైదరాబాద్‌: అంకురాల కోసం ప్రత్యేకంగా ‘స్టార్టప్ తెలంగాణ’ పోర్టల్‌ను ప్రారంభిస్తున్నట్లు రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ప్రకటించారు. హైదరాబాద్ హైచ్‌ఐసీసీలో ఐటీ పాలసీ విడుదల చేసిన సందర్భంగా.. స్టార్టప్ ఎకోసిస్టం బలోపేతం కోసం రూపొందించిన ఈ ప్రత్యేక పోర్టల్‌ను కేటీఆర్‌ ఆవిష్కరించారు. తెలంగాణ స్టార్టప్ ఎకోసిస్టం మొత్తానికి ఈ పోర్టల్ వన్ స్టాప్ డెస్టినేషన్‌గా నిలుస్తుందన్నారు. స్టార్టప్‌లకు సంబంధించిన సర్వీసులు అందించటం ఈ పోర్టల్ మఖ్య ఉద్దేశం. అందులో భాగంగా అంకురాల గుర్తింపు, మార్గదర్శనం, రాయితీలు అందించటం, ప్రభుత్వ సహకారం.. ఇలా అన్నింటినీ ఈ పోర్టల్ పర్యవేక్షిస్తుందని కేటీఆర్‌ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసే జీవోలు, పాలసీలు, సర్కులర్లు, పథకాలు అన్నీ ఈ పోర్టల్‌లో పొందుపరచనున్నట్లు స్పష్టం చేశారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని