Top Ten News @ 1 PM

తాజా వార్తలు

Updated : 14/07/2021 13:07 IST

Top Ten News @ 1 PM

1. AP News: కృష్ణా జలాలపై మరోసారి సుప్రీంకు

పొరుగు రాష్ట్రం తెలంగాణతో ఉన్న కృష్ణా జలాల వివాదంపై ఏపీ ప్రభుత్వం మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ మేరకు సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలు చేసింది. చట్టబద్ధమైన నీటి వాటాను తెలంగాణ రానీయట్లేదని పిటిషన్‌లో ఏపీ ప్రభుత్వం ఆరోపించింది. ‘‘శ్రీశైలంలో తక్కువ నీరున్నా తెలంగాణ విద్యుదుత్పత్తి చేసింది. వారి తీరుతో ఏపీ ప్రజలకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది. తెలంగాణ చర్యలు రాజ్యాంగ విరుద్ధం. ఆ రాష్ట్ర వైఖరి మా ప్రజల జీవించే హక్కును హరించేలా ఉంది’’ అని ఏపీ ప్రభుత్వం పిటిషన్‌లో పేర్కొంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

AP News: సీఎం జగన్‌ బెయిల్‌ రద్దంటూ కల్పిత కథనం

2. drone: సరిహద్దులో మరోసారి డ్రోన్ కలకలం

భారత్‌-పాక్‌ అంతర్జాతీయ సరిహద్దు వద్ద మరోసారి డ్రోన్‌ సంచారం కలకలం సృష్టించింది. జమ్ముకశ్మీర్‌లోని అర్నియా సెక్టార్ వద్ద మంగళవారం రాత్రి సరిహద్దు భద్రతా బలగాలు (బీఎస్‌ఎఫ్) దీన్ని గుర్తించాయి. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది కాల్పులు జరపడంతో డ్రోన్ వెనక్కి జారుకుంది. ఈ మేరకు బీఎస్‌ఎఫ్‌ ఓ ప్రకటన విడుదల చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. Vaccine: భారత్‌ ఓకే అంటే వెంటనే పంపుతాం

వీలైనంత వేగంగా భారత్‌కు కొవిడ్‌ టీకాలను అందజేయడానికి అమెరికా సిద్ధంగా ఉందని ఆ దేశ విదేశాంగశాఖ అధికార ప్రతినిధి నెడ్ ప్రైస్ తెలిపారు. అయితే, టీకాలు స్వీకరించడానికి భారత్‌ ఇంకా పచ్చజెండా ఊపాల్సి ఉందన్నారు. టీకా విరాళాలను స్వీకరించే విషయంలో చట్టపరమైన అంశాలను భారత్‌ సమీక్షిస్తోందని తెలిపారు. దీనికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉందని ఇండియా తెలిపినట్లు పేర్కొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Corona: మరోసారి పెరిగిన కొత్త కేసులు

4. ఈ బర్గర్‌ ధర రూ.4.42 లక్షలు..!

సాధారణంగా బర్గర్‌ తినాలనిపిస్తే ఏ బేకరీకో వెళ్లి దర్జాగా ఆర్డరిస్తాం. బేకరీ స్థాయిని అనుసరించి బిల్లు మహా అయితే.. రూ.50 నుంచి 200 వరకు అవుతుంది. కానీ ఈ బర్గర్‌ తినాలంటే జేబులు ఒకసారి తడుముకోవాల్సిందే. ఎందుకంటే.. ఈ ఒక్క బర్గర్ ధర అక్షరాలా రూ.4.42 లక్షలు. ప్రపంచంలో ఇదే అత్యంత ఖరీదైన బర్గర్‌గా దీని తయారీదారులు చెప్పుకొంటున్నారు.  ఈ బర్గర్‌ను నెదర్లాండ్స్‌లోని డే డాల్టన్‌ రెస్టారెంట్‌లో పని చేస్తున్నరాబర్ట్‌ జాన్‌ డీ వీన్‌ అనే చెఫ్‌ తయారు చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. ‘నారప్ప’ ట్రైలర్‌ వచ్చేసిందప్ప

 అగ్రకథానాయకుడు దగ్గుబాటి వెంకటేశ్‌ ప్రధాన పాత్రలో నటించిన యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌  ‘నారప్ప’. ‘సీతమ్మ వాకింట్లో సిరిమల్లె చెట్టు’ ఫేమ్‌ శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వం వహించారు. కరోనా కారణంగా ఏర్పడిన పరిస్థితుల రీత్యా.. ఎన్నో రోజుల సంగ్ధిదత తర్వాత ‘నారప్ప’ చిత్రాన్ని అమెజాన్‌ ప్రైమ్‌ వేదికగా విడుదల చేస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ నేపథ్యంలో బుధవారం ‘నారప్ప’ ట్రైలర్‌ను నెట్టింట్లో విడుదల చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. డీజీపీ సమక్షంలో మావోయిస్టు నేత లొంగుబాటు

మావోయిస్టు నేత, ప్లాటూన్‌ పార్టీ కమిటీ మెంబర్‌ రావుల రంజిత్‌ అలియాస్‌ శ్రీకాంత్‌ తెలంగాణ డీజీపీ ఎదుట లొంగిపోయారు. ఈ సందర్భంగా డీజీపీ మహేందర్‌రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. మావోయిస్టు కార్యక్రమాలపై రంజిత్‌ విరక్తి చెంది లొంగుబాటుకు అనుమతి కోరారన్నారు. పాఠశాల వయసు నుంచే మావోయిస్టు కార్యక్రమాల్లో ఆయన చురుగ్గా పాల్గొన్నారని చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* Encounter: లష్కరే కమాండర్‌ హతం

7. TS News: హుజూరాబాద్ కాంగ్రెస్‌ ఇన్‌ఛార్జులు వీళ్లే 

భాజపా నేత, మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ రాజీనామాతో ఖాళీ అయిన హుజూరాబాద్‌ అసెంబ్లీ స్థానానికి త్వరలో ఉప ఎన్నిక జరగనుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ హుజూరాబాద్‌ నియోజకవర్గ, మండల బాధ్యులను టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి నియమించారు. నియోజకవర్గ ఎన్నికల బాధ్యుడిగా మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజ నర్సింహ, ఎన్నికల సమన్వయకర్తలుగా ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌లను ప్రకటించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

8. South Africa: ఇదో ‘జుప్తా’ కథ!

దక్షిణాఫ్రికా అట్టుడుకుతోంది! మాజీ అధ్యక్షుడు జాకబ్‌ జుమాకు జైలు శిక్ష విధించటంతో ఆయన మద్దతుదారులు రెచ్చిపోయి విధ్వంసం సృష్టిస్తున్నారు. నల్లజాతి సూరీడు నెల్సన్‌ మండేలా స్ఫూర్తితో దక్షిణాఫ్రికా స్వాతంత్య్రోద్యమంలో పాల్గొని, ఆ తర్వాత దేశాధ్యక్షుడైన జాకబ్‌ జుమా ఇప్పుడు ఎందుకని జైలు శిక్ష ఎదుర్కోవాల్సి వస్తోందో చూస్తే వెనకాల బోలెడంత కథ... అందులో మన భారతీయ అన్నదమ్ములు (గుప్తా బ్రదర్స్‌) ముగ్గురి కీలక పాత్ర ఎంతో ఆసక్తికరం! పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* IRCTC: 6 టికెట్ల కంటే ఎక్కువ బుక్‌ చేయాలా?

9. మూడో ముప్పువేళ.. ఈ కాంవడ్ యాత్ర ఏంటి..?

కరోనా మూడోముప్పు పొంచి ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తుంటే.. ఉత్తర్‌ప్రదేశ్‌ (యూపీ) ప్రభుత్వం కాంవడ్ యాత్రకు అనుమతి ఇవ్వడంపై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఈ క్లిష్ట సమయంలో యాత్రను ఎందుకు అనుమతించారో సమాధానం చెప్పాలంటూ ప్రభుత్వానికి నోటీసులు జారీచేసింది. ఈ విషయాన్ని కోర్టు స్వయంగా పరిగణనలోకి తీసుకుంది. దీనికి సంబంధించిన తదుపరి విచారణ శుక్రవారం జరగనుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. Chris Gayle: గేల్‌ ఇప్పుడు ‘యూనివర్స్‌ బాస్‌’ కాదు!

స్టిండీస్‌ స్టార్‌ ప్లేయర్‌ క్రిస్‌గేల్‌కు ‘యూనివర్స్‌ బాస్‌’ అనే ముద్దు పేరున్న సంగతి తెలిసిందే. దాన్ని ఎవరూ పెట్టకుండానే అతడే స్వయంగా ప్రకటించుకున్నాడు. దాంతో కొంతకాలంగా అతడిని సంబోధించే క్రమంలో చాలా మంది యూనివర్స్‌ బాస్‌గానే పిలుస్తున్నారు. అతడి బ్యాట్‌ మీద కూడా అలా యూనివర్స్‌ బాస్‌ అనే స్టిక్కర్‌ ఉంటుంది. అయితే, తాజాగా ఆస్ట్రేలియాతో ఆడిన మూడో టీ20లో గేల్‌ (67; 38 బంతుల్లో 4x4, 7x6) రెచ్చిపోయి ఆడాడు. దాంతో విండీస్‌ 3-0 తేడాతో ఆస్ట్రేలియాపై సిరీస్‌ గెలుపొందింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Hardik Pandya: హార్దిక్‌ మొదట్నుంచీ పేసర్‌ కాదు!


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని