‘హనుమ జన్మస్థలంపై నివేదిక సిద్ధం’
close

తాజా వార్తలు

Updated : 13/04/2021 12:24 IST

‘హనుమ జన్మస్థలంపై నివేదిక సిద్ధం’

తితిదే ఈవో జవహర్‌రెడ్డి

తిరుమల: కలియుగ ప్రత్యక్షదైవం శ్రీవేంకటేశ్వరస్వామి కొలువైన తిరుమల.. హనుమంతుడి జన్మస్థలమని తితిదే ఈవో కేఎస్‌ జవహర్‌రెడ్డి స్పష్టం చేశారు. దీనికి సంబంధించిన ఆధారాలు తమ వద్ద ఉన్నాయని వెల్లడించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..‘‘ తితిదే పండితులచే ఏర్పాటు చేసిన కమిటీ సప్తగిరుల్లోని అంజనాద్రి పర్వతమే హనుమంతుడి జన్మస్థలమని బలమైన ఆధారాలను సేకరించింది. తితిదే వద్ద ఉన్న ఆధారాలను బయటపెడతాం. ఆధారాలతో నివేదిక తయారు చేశాం. నివేదికను ప్రజల ముందుంచి అభిప్రాయాలు సేకరిస్తాం. హనుమ జన్మస్థలం తమదేనని ఇప్పటి వరకు ఏ రాష్ట్రం ప్రకటించలేదు. ఇతర రాష్ట్రాలు కూడా ఆధారాలు ఉంటే బయటపెట్టవచ్చు. హనుమంతుడి జన్మస్థలంపై క్షేత్రస్థాయిలో చర్చ జరగాలి’’ అని జవహర్‌రెడ్డి అన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని