AP: కరోనాతో 98 మంది మృతి
close

తాజా వార్తలు

Updated : 15/05/2021 18:51 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

AP: కరోనాతో 98 మంది మృతి

అమరావతి: కరోనాతో బాధపడుతూ ఆంధ్రప్రదేశ్‌లో 98మంది మృతి చెందారని ఏపీ వైద్య, ఆరోగ్యశాఖ తాజా బులిటెన్‌లో తెలిపింది. గత 24 గంటల్లో 89,535 కరోనా పరీక్షలు చేయగా, 22,517 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకూ రాష్ట్రంలో 14,11,320 మంది వైరస్‌ బారినపడగా, మొత్తం 1,78,80,755 నమూనాలను ఆరోగ్య శాఖ పరీక్షించింది.

కొవిడ్‌తో బాధపడుతూ గత 24 గంటల్లో అనంతపురంలో 12 మంది మృతి చెందగా, నెల్లూరులో 11, తూర్పుగోదావరి 10, విశాఖ 9, విజయనగరం 9, చిత్తూరు 8, శ్రీకాకుళం 8, గుంటూరు 7, పశ్చిమగోదావరి 7, కృష్ణా 5, కర్నూలు 5, ప్రకాశం 5, కడపలో ఇద్దరు మృత్యువాతపడ్డారు.  తాజాగా 18,739 మంది కరోనా నుంచి కోలుకోగా, మొత్తం 11,94,582 మంది కరోనా నుంచి బయటపడ్డారు. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా తూర్పుగోదావరిలో 3,383 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, అత్యల్పంగా విజయనగరంలో 992 మంది కరోనా బారిన పడ్డారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని