Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

తాజా వార్తలు

Published : 19/10/2021 12:56 IST

Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

1. KTR: ఈటల కోసం కాంగ్రెస్‌ డమ్మీ అభ్యర్థిని నిలబెట్టింది: కేటీఆర్‌

హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో దమ్ముంటే కాంగ్రెస్‌ పార్టీ డిపాజిట్‌ తెచ్చుకోవాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డికి మంత్రి కేటీఆర్‌ సవాల్‌ విసిరారు. హుజూరాబాద్‌లో భాజపా, కాంగ్రెస్‌ కుమ్మక్కయ్యాయని ఆరోపించారు. భాజపా అభ్యర్థి ఈటల రాజేందర్‌ కోసం కాంగ్రెస్ డమ్మీ అభ్యర్థిని నిలబెట్టిందని కేటీఆర్‌ అన్నారు. హుజూరాబాద్‌లో తప్పకుండా తెరాస గెలుస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. రేవంత్‌ చిలకజోస్యం చెప్పుకుంటే మంచిదని ఈ సందర్భంగా ఎద్దేవా చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. Virat Kohli - Ravi Shastri: కోహ్లీ-శాస్త్రి విజయవంతమయ్యారా.. లేదా?

విరాట్‌ కోహ్లీ - రవిశాస్త్రి ద్వయం విజయవంతమైందా.. లేదా? అని ప్రశ్నిస్తే సమాధానం చెప్పడం చాలా కష్టం. ఎందుకంటే వీరిద్దరూ ఎంతో మంది దిగ్గజాలకు సాధ్యం కాని ఫలితాలు సాధించడం ఒక ఎత్తయితే.. ఒక్క ఐసీసీ ట్రోఫీ సాధించలేకపోవడం కూడా అంతే ప్రధానంగా చెప్పుకోవాల్సిన విషయం. దీంతో ఇద్దరూ తమ చివరి అవకాశంగా ఇప్పుడు జరుగుతోన్న టీ20 ప్రపంచకప్‌పైనే దృష్టి సారించారు. ఇది గెలిచి మరింత గొప్ప పేరు తెచ్చుకొని విమర్శకుల నోర్లు మూయించాలని చూస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

IPL 2021: ధోనీ లేకుండా చెన్నై సూపర్‌ కింగ్స్‌ లేదు: శ్రీనివాసన్

3. Bill Gates: మహిళా ఉద్యోగికి ఈ-మెయిళ్లు.. బిల్‌గేట్స్‌ను ఆనాడే హెచ్చరించారట

మైక్రోసాఫ్ట్‌ సహ వ్యవస్థాపకుడు, దాతృత్వ కార్యక్రమాల ద్వారా ప్రపంచవ్యాప్తంగా విశేష ఆదరణ పొందిన బిల్‌ గేట్స్‌ 2020లో సంస్థ బోర్డు నుంచి వైదొలిగారు. 20 ఏళ్ల క్రితం సంస్థలోని ఓ మహిళా ఉద్యోగితో ఆయన నడిపిన లైంగిక సంబంధాలు బయటపడటంతో గేట్స్‌ బోర్డు నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. అయితే దీని గురించి 2008లోనే బిల్‌గేట్స్‌ను కంపెనీ హెచ్చరించినట్లు తాజాగా వాల్‌ స్ట్రీట్‌ జర్నల్‌ కథనం వెల్లడించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. ఏపీ ప్రజల నెత్తిన రూ.5లక్ష కోట్ల అప్పు.. ఎలా తీరుస్తారు?: ఐవైఆర్‌

ఏపీ ప్రభుత్వానికి సరైన ఆలోచనా విధానం లేకపోవడంతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తారుమారైందని భాజపా నేత, మాజీ సీఎస్‌ ఐవైఆర్‌ కృష్ణారావు విమర్శించారు. అప్పు తెచ్చి పంచడమే ప్రభుత్వం పనిగా ఉందని ఎద్దేవా చేశారు. విజయవాడ భాజపా కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రజల నెత్తిన ఇప్పుడు సుమారు రూ.5లక్షల కోట్ల అప్పు ఉందన్నారు.  ఇంకా ఎంతకాలం అప్పు పుడుతుందో ప్రభుత్వం ఆలోచించుకోవాలన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* Road Accident: డివైడర్‌ను ఢీకొని బైకును ఢీకొట్టిన కారు.. ముగ్గురి మృతి

5. Afghanistan: అఫ్గాన్‌ భవితను శాసించిన ఆ ముగ్గురూ ఎక్కడా..?

ప్రస్తుతం ఉన్న అఫ్గాన్‌ స్థితికి ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ ఆ ముగ్గురు కారకులే. ఒకరు దౌత్యవేత్త.. మరొకరు రాజకీయ వేత్త.. ఇంకొకరు తాలిబన్‌..! ప్రస్తుతం వీరిలో ఎవరూ సంతృప్తిగా లేరు. అమెరికా తన భుజస్కందాలపై ఉంచిన బాధ్యతను నిర్వహించడంలో విఫలమై ఒకరు.. పాలనా వైఫల్యంతో అధికారం కోల్పోయి మరొకరు.. పేరుకు అధికారం దక్కినా.. పెత్తనం మరొకరిదైనందుకు ఇంకొకరు అసంతృప్తిగా ఉన్నారు. వారెవరో తెలుసా.. అమెరికా రాయబారి జల్మే ఖలీల్జాద్‌, అఫ్గాన్‌ మాజీ అధ్యక్షుడు అష్రఫ్‌ ఘనీ.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. IRCTC: ఈ స్టాక్ 6 నెలల్లో 293 శాతం రిటర్న్స్‌ ఇచ్చింది!

బీఎస్‌ఈలో రూ.లక్ష కోట్ల మార్కెట్‌ క్యాపిటలైజేషన్ కలిగిన కంపెనీల జాబితాలో ‘ఇండియన్‌ రైల్వే క్యాటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పొరేషన్‌(ఐఆర్‌సీటీసీ)’ చేరింది. మంగళవారం ఈ కంపెనీ షేరు విలువ ఓ దశలో 8 శాతం పెరిగి రూ.6,332.25కు చేరడంతో ఈ ఘనత సాధించింది. గత ఐదు ట్రేడింగ్‌ సెషన్లలో షేరు ధర ఏకంగా 33 శాతం ఎగబాకడం విశేషం. ప్రస్తుతం బీఎస్‌ఈలో రూ.1,00,612 కోట్లతో ఈ సంస్థ మార్కెట్‌ విలువ పరంగా 57వ స్థానంలో ఉంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Audi Q5: రూ.2 లక్షలతో ఆడీ క్యూ5ని బుక్‌ చేసుకోవచ్చు!

7. Crime News: విషాద.. విషబీజం

ఆ బాలికలో మొగ్గతొడిగిన ద్వేషం.. ఓ కుటుంబాన్ని నిలువునా కూల్చింది. కళ్లెదుటే కన్నవారు, తోబుట్టు విలవిలలాడుతూ ఊపిరి వదులుతున్నా పంటి బిగువన వాస్తవాన్ని దాచిన ఆమె వాస్తవాన్ని ఎన్నో రోజులు దాచలేక పోయింది. చిన్నవారైన తమ్ముడు, చెల్లికి ఇస్తున్న ప్రాధాన్యం.. పెద్ద సంతానంగా తనకు ఈ తల్లిదండ్రులు ఎందుకివ్వరనే ఉడుకుమోతుతనం ఉగ్రరూపమే దాల్చింది. ఆ రూపం ఏ స్థాయిలో ఉందో తెలుసుకోవాలంటే.. మనం జులై 13వ తేదీ పుటను ఓసారి తిప్పేయాలి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. Pooja Hegde: మన రిలేషన్‌ గురించి ఎప్పుడు చెబుదాం.. నెటిజన్‌కు పూజ దీటైన రిప్లై!

ప్రస్తుతం తెలుగులో వరుస చిత్రాలతో దూసుకుపోతున్న కథానాయిక పూజాహెగ్డే. అటు అగ్ర కథానాయకులతోనూ, ఇటు యువ కథానాయకులతో ఆడి పాడుతోంది. అంతేకాదు, ఆమె నటించిన ఆరు చిత్రాలు వరుసగా హిట్‌ అయ్యాయి. ఇటీవల అఖిల్‌కు జోడీగా నటించిన ‘మోస్ట్‌ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్‌’లో ఆమె నటనకు ప్రశంసలు దక్కుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ట్విటర్‌ వేదికగా అభిమానులతో ముచ్చటించింది. వారు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tollywood: నిజ జీవితంలో ‘హిట్‌’ కొట్టని జంట కథలు

9. India Corona: అదుపులోకి వస్తోన్న మహమ్మారి.. ఎంతమందికి వైరస్ సోకిందంటే..?

కరోనా మహమ్మారి వ్యాప్తి క్రమంగా అదుపులోకి వస్తోంది. గత కొద్దిరోజులుగా తగ్గుముఖం పట్టిన కొత్త కేసులు.. తాజాగా 13 వేలకు పడిపోయాయి. కొత్త కేసులు 231 రోజులు, క్రియాశీల కేసులు 227 రోజుల కనిష్ఠానికి క్షీణించాయి. మరణాల సంఖ్య 200 దిగువనే నమోదైంది. మంగళవారం కేంద్ర ఆరోగ్య శాఖ ఈ గణాంకాలను విడుదల చేసింది. సోమవారం 11,81,314 మంది కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. భర్తపై అనుమానం.. జిమ్‌లో మహిళను చితకబాదిన భార్య

భర్తతో వివాహేతర సంబంధం ఉందన్న అనుమానంతో అతడి భార్య ఓ మహిళపై వ్యాయామశాలలో బూట్లతో దాడికి దిగింది. పక్కనున్నవారు ఆపడానికి ప్రయత్నించినా శాంతించకుండా విచక్షణారహితంగా విరుచుకుపడింది. ఆమె ఎవరో తనకు  తెలియదని భర్త ఎంత మొత్తుకున్నా వినిపించుకోలేదు. చివరికి భార్యాభర్తలిద్దరూ పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి పరస్పరం కేసులు పెట్టుకున్నారు. మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో ఈ ఘటన జరిగింది. ఈ నెల 15న జరిగిన ఈ ఉదంతానికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండిAdvertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని