టాప్‌ 10 న్యూస్‌ @ 9AM
close

తాజా వార్తలు

Published : 14/04/2021 08:57 IST

టాప్‌ 10 న్యూస్‌ @ 9AM

1. పరీక్షలు, కేసుల్లో తగ్గుదల

దేశంలో కరోనా కేసులు కాస్త నెమ్మదించాయి. ఆదివారం పరీక్షల సంఖ్య సాధారణ రోజులతో పోలిస్తే 16%మేర తగ్గడంతో ఆ తేడా మంగళవారం విడుదల చేసిన కేసుల్లోనూ కనిపించింది. ఆదివారం నాటి పరీక్షల ఫలితాలను రాష్ట్రాలు సోమవారం విడుదల చేస్తే, వాటన్నింటినీ క్రోడీకరించి కేంద్ర వైద్యఆరోగ్యశాఖ మంగళవారం విడుదల చేయడం తొలి నుంచీ ఆనవాయితీగా వస్తోంది. అందుకే సాధారణ రోజులతో పోలిస్తే ప్రతి మంగళవారం కేసుల్లో ఎంతో కొంత తగ్గుదల కనిపిస్తోంది. ఆ పరంపర కొనసాగింది.మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి

2. ఐక్యంగా విజయం సాధిద్దాం

కరోనా మహమ్మారి సృష్టించిన సంక్షోభం నుంచి మానవాళి సురక్షితంగా బయటపడాలంటే ప్రపంచ దేశాలన్నీ ఐక్యంగా ముందడుగు వేయాల్సిన ఆవశ్యకత ఉందని ప్రధాని మోదీ తెలిపారు. కలసికట్టుగా చర్యలు చేపట్టకపోతే ఎన్నటికీ ఆ వైరస్‌ను ఓడించలేమని పేర్కొన్నారు. విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ, మేధో మథన సంస్థ.. అబ్జర్వర్‌ రీసెర్చ్‌ ఫౌండేషన్‌(ఓఆర్‌ఎఫ్‌) సంయుక్తంగా నిర్వహిస్తోన్న ‘రైజినా సంవాదం’ కార్యక్రమంలో మంగళవారం ప్రధాని మోదీ ప్రసంగించారు.మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి

3. కిలో మటన్‌.. మద్యం బాటిల్‌

నాగార్జునసాగర్‌ ఉప ఎన్నిక ప్రచారానికి గురువారం తెరపడనుండటంతో ప్రధాన పార్టీలు కాక పెంచాయి. ప్రచారాన్ని పతాక స్థాయిలో నిర్వహిస్తున్నాయి. సిట్టింగ్‌ స్థానాన్ని కాపాడుకోవాలని తెరాస, ఎదురు దెబ్బలతో సతమతమవుతున్న పార్టీకి కొత్త జవసత్వాలు కల్పించాలని కాంగ్రెస్‌ విజయం కోసం సర్వశక్తులూ ఒడ్డుతున్నాయి. అనూహ్య ఫలితం సాధించాలనే తపనతో భాజపా వ్యవహరిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రధాన పార్టీలు ఓటర్లను ప్రలోభపెట్టే పనుల్లో వేగం పెంచాయి. పోలింగ్‌కు మరో నాలుగు రోజులుండగానే పలు మండలాల్లో రెండు ప్రధాన పార్టీలు జోరుగా మద్యం, మాంసం పంపిణీ చేస్తున్నాయి.మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి

4. కరోనా కథ ఇంకా ముగియలేదు

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి కథ ఇంకా ముగియలేదని, వైరస్‌ను అడ్డుకోవడానికి టీకా ఒక్కటే మార్గం కాదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) డైరెక్టర్‌ జనరల్‌ టెడ్రోస్‌ అథనోమ్‌ అన్నారు. ఆరోగ్య చర్యలు, జాగ్రత్తలు పాటించడం ద్వారా కొద్ది నెలల్లో మహమ్మారిని నియంత్రించవచ్చని చెప్పారు. ఈ మేరకు ఆయన మంగళవారం జెనీవాలో మాట్లాడారు. ‘‘ప్రపంచ వ్యాప్తంగా సుమారు 78 కోట్ల టీకా డోసులు అందించినా... కరోనా అంతానికి ఇంకా చాలా సమయం ఉంది.మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి

5. రోహిత్‌ నమ్మాడు.. రాహులే వికెట్లు తీశాడు

తాను బంతిని అందుకొన్నప్పుడు ఒత్తిడి నెలకొందని ముంబయి ఇండియన్స్‌ యువ స్పిన్నర్‌ రాహుల్‌ చాహర్‌ అన్నాడు. సామర్థ్యంపై నమ్మకం, రోహిత్‌ తనపై చూపిన విశ్వాసంతో రాణించానని తెలిపాడు. ఓడిపోయే స్థితి నుంచి గొప్పగా పుంజుకున్నామని ఆ జట్టు కెప్టెన్‌ రోహిత్‌ శర్మ పేర్కొన్నాడు. ఈ ఘనత మొత్తం జట్టుకే చెందుతుందన్నాడు. ఓటమి నిరాశ కలిగించిందని చాలా వరకు నాణ్యమైన క్రికెట్టే ఆడామని కోల్‌కతా నైట్‌రైడర్స్‌ సారథి ఇయాన్‌ మోర్గాన్‌ వెల్లడించాడు. హిట్‌మ్యాన్‌ సేన నిర్దేశించిన 153 పరుగుల లక్ష్య ఛేదనలో కోల్‌కతా 10 పరుగుల తేడాతో ఓడిన సంగతి తెలిసిందే.మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి

6. ఈ ఏడాది ఇంక్రిమెంట్ల జోరు

తన జీవులకు ఇది శుభవార్తే. ఆర్థిక వ్యవస్థ రికవరీ దిశగా అడుగులు వేస్తుండటంతో ఈ ఏడాది తమ ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు ఇవ్వడం ద్వారా వేతనాలు పెంచేందుకు సుముఖంగా ఉన్నామని 59 శాతం దేశీయ సంస్థలు తెలిపినట్లు స్టాఫింగ్‌ కంపెనీ జీనియస్‌ కన్సల్టెంట్స్‌ అధ్యయనం పేర్కొంది. ‘నియామకాలు, వలసలు, పరిహార ధోరణి 2021-22’ పేరుతో నిర్వహించిన ఈ సర్వేలో పలు ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఏడాది ఫిబ్రవరి, మార్చిలో ఆన్‌లైన్‌లో 1,200 కంపెనీల ప్రతినిధుల నుంచి అభిప్రాయాలు సేకరించి, ఈ నివేదికను రూపొందించినట్లు జీనియస్‌ కన్సల్టెంట్స్‌ వివరించింది.మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి

7. పాత ముఖం.. కొత్త మకాం

హైదరాబాద్‌ గచ్చిబౌలిలోని ఓ ఫ్లాట్‌లో సైబరాబాద్‌ పోలీసులు గత అక్టోబరు 12న దాడి చేశారు. బెట్టింగ్‌ నిర్వహిస్తున్న ఏడుగురు సభ్యుల ముఠా చిక్కింది. రాజస్థాన్‌ నుంచి వచ్చి ఇక్కడ దందా నడిపిస్తున్నట్లు వెల్లడైంది. దీనికి సరిగ్గా వారంరోజుల ముందు గోవాలోని ఓ ఫ్లాట్‌లో ముగ్గురు యువకులు ఆన్‌లైన్‌ బెట్టింగ్‌కు పాల్పడుతూ అక్కడి పోలీసులకు చిక్కారు. వారు హైదరాబాద్‌కు చెందిన భాను, రాజురావు, శశికిరణ్‌గా తేలింది.మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి

8. సౌరశక్తి మచ్చికకు మానవ యుక్తి!

ఇంటిపై సౌర ఫలకాల్ని ఏర్పాటు చేసుకుని.. భానుడి భగభగల్ని విద్యుత్‌గా మార్చుకుంటున్నాం.. ఇంట్లో అవసరాలకు వాడేస్తున్నాం.. అదే భూమికి కొన్ని వేల మైళ్లు దూరంగా అంతరిక్షంలో సోలార్‌ ప్యానల్స్‌ని ఏర్పాటు చేస్తే.. భూమికి చేరకముందే సూర్యకాంతిని విద్యుత్‌గా అక్కడే ఒడిసి పట్టేస్తే!! కావాల్సినంత విద్యుత్‌ శక్తిని భూమిపై ఎక్కడికైనా పంపగలిగితే!! అద్భుతమే కదా! ఇలాంటి ప్రయత్నాలు ఇప్పటికే మొదలయ్యాయి. ఆ విశేషాలేంటో తెలుసుకుందాం!మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి

9. ఈ బతుకు ఏదో సాధించడానికే అనుకున్నా!

రైలు ప్రమాదంలో తీవ్ర గాయాల పాలైంది... మృత్యువుతో పోరాడినా...రెండు కాళ్లనూ కోల్పోయింది. అప్పుడే అమ్మ ధైర్యాన్ని నూరిపోసి, కొత్త శక్తుల్ని నింపింది. ఆ అమ్మాయి పోరాటాన్ని ప్రారంభించింది. చదువు కోసం కోర్టుల్నీ, చట్ట సభనూ కదిలించింది. ఇప్పుడు మనుషుల్లోని నిర్దయపై యుద్ధం చేస్తోంది. మనసుల్లోని చీకటిపై పోరాడుతోంది... ఆ యోధ డాక్టర్‌ రోషన్‌ షేక్‌...పోరాటానికే స్ఫూర్తినిచ్చే తన కథ చదవండి మరి.మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి

10. చిన్నోళ్లు.. సైబర్‌ నేరాల్లో చిక్కుతున్నారు!

సామాజిక మాధ్యమాల్లో ప్రసారమవుతున్న అసభ్య, అశ్లీల అంశాలకు ప్రభావితులవుతున్న కొందరు విద్యార్థులు, మైనర్లు నేరస్థులుగా మారుతున్నారు. తెలిసీతెలియని వయసులో వారి మనసుకు ఏదితోస్తే అదిచేస్తున్నారు. ఒక వైద్యవిద్యార్థిని పేరుతో అసభ్య సందేశాలు పంపించాడన్న అభియోగంపై సైబరాబాద్‌ పోలీసులు తొమ్మిదో తరగతి చదువుకుంటున్న మైనర్‌ను జువైనల్‌ హోంకు పంపించారు. హైదరాబాద్‌ పోలీసులు ఓ విద్యార్థికి తాఖీదులు జారీ చేశారు. త్వరలో అరెస్ట్‌ చేసేందుకు రంగం సిద్ధం చేశారు.మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని