Top 10 News @ 1PM
close

తాజా వార్తలు

Published : 17/06/2021 13:02 IST

Top 10 News @ 1PM

1. Corona: 96 శాతానికి చేరువైన రికవరీ రేటు

దేశంలో కరోనా తీవ్రత అదుపులోకి వస్తోంది. నెలరోజులకు పైగా కొత్త కేసుల కంటే రికవరీలే అధికంగా ఉంటున్నాయి. క్రియాశీల కేసుల కొండ కరిగిపోతోంది. మరణాల సంఖ్యలో తగ్గుదల కనిపిస్తోంది. తాజాగా 67వేల మందికి కరోనా సోకినట్లు గురువారం కేంద్ర ఆరోగ్యశాఖ గణాంకాలు వెల్లడించాయి. బుధవారం 19,31,249 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా..67,208మందికి పాజిటీవ్‌ వచ్చింది.మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి

2. Maharashtra: ‘డెల్టా ప్లస్‌’తో థర్డ్‌వేవ్‌ ముప్పు..!

రాష్ట్రంలో కరోనా వైరస్‌ ‘డెల్టా ప్లస్‌’ వేరియంట్‌తో థర్డ్‌ వేవ్‌ ముప్పు పొంచి ఉందని మహారాష్ట్ర ఆరోగ్యశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఒకవేళ అదే జరిగితే సెకండ్‌ వేవ్‌కు రెట్టింపు సంఖ్యలో కేసులు వస్తాయని మహరాష్ట్ర కొవిడ్‌-19 టాస్క్‌ ఫోర్స్‌, వైద్య నిపుణుల బృందం హెచ్చరించింది. ఈ మేరకు నివేదికలను ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రేకు సమర్పించినట్లు వైద్యాధికారులు తెలిపారు. ప్రజలు నిర్లక్ష్యంగా ఉంటే సెకండ్ వేవ్‌ ముగియక ముందే థర్డ్‌ వేవ్‌ వచ్చే ప్రమాదముందని వైద్యులు ఆందోళన చెందుతున్నారు.మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి

3. Satya Nadella: మైక్రోసాఫ్ట్‌ ఛైర్మన్‌గా సత్యనాదెళ్ల

టెక్‌ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ బోర్డులో కీలక మార్పులు జరిగాయి. ప్రస్తుత సీఈవో సత్యనాదెళ్లకు మరిన్ని కీలక అధికారాలు కట్టబెట్టారు. ఆయన్ను బోర్డు ఛైర్మన్‌గా ఎన్నుకున్నారు. బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్స్‌ ఈ మేరకు ఏకగ్రీవంగా సత్య నాదెళ్ల పేరుకు ఆమోదం తెలిపారు. దీంతో బోర్డు అజెండాను నిర్ణయించే అధికారం ఆయనకు దక్కనుంది. ‘‘వ్యూహాత్మక అవకాశాలను దక్కించుకొనేందుకు, కీలక ఇబ్బందులను గుర్తించేందుకు ఆయనకు వ్యాపారంపై ఉన్న అవగాహన బాగా ఉపయోగపడుతుంది’’ అని మైక్రోసాఫ్ట్‌ ఓ ప్రకటనలో పేర్కొంది.మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి

4. CBSE: జులై 31నాటికి 12వ తరగతి ఫలితాలు!

జులై 31నాటికి సీబీఎస్‌ఈ పరీక్షా ఫలితాలను ప్రకటించాలని భావిస్తున్నట్లు గురువారం కేంద్రప్రభుత్వం సుప్రీం కోర్టుకు వెల్లడించింది. కరోనా ఉద్ధృతి నేపథ్యంలో 12వ తరగతి పరీక్షలను రద్దు చేస్తూ బోర్డు నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. మరోపక్క అదే రోజున సీఐఎస్‌సీఈ ఫలితాలకు వెల్లడించాలని భావిస్తోంది.   జూన్‌ మొదటి వారంలో జరిగిన ఉన్నతస్థాయి సమీక్ష సమావేశంలో పరీక్షల రద్దు నిర్ణయానికి ప్రధాని నరేంద్రమోదీ ఆమోదముద్ర వేశారు.మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి

5. Covishield: ‘డెల్టా’పై ఒక్క డోసుతో 61% సామర్థ్యం

కొవిషీల్డ్ టీకా ఒక్కడోసు డెల్టా వేరియంట్‌పై 61 శాతం ప్రభావం చూపినట్లు వెల్లడైంది. భారత్‌లో జరిపిన అధ్యయనంలో భాగంగా ఈ విషయాన్ని గుర్తించినట్లు కొవిడ్ వర్కింగ్ గ్రూప్ చీఫ్ డాక్టర్ ఎన్‌కే అరోరా తెలిపారు. కొవిషీల్డ్ టీకా రెండు డోసుల మధ్య అంతరంపై చర్చ నడుస్తోన్న వేళ.. ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అలాగే ఆ వ్యవధి పెంపుపై చేసిన పరిశోధన, తీసుకున్న నిర్ణయాలను ఈ సందర్భంగా వెల్లడించారు.మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి

6. WTC Final: వారి విమర్శల వల్లే నేనిక్కడ.. ఇలా!

విమర్శలను తాను పట్టించుకోనని టీమ్‌ఇండియా వైస్‌కెప్టెన్‌ అజింక్య రహానె అంటున్నాడు. నిజానికి వాటివల్లే తానీ స్థాయిలో ఉండగలిగానని పేర్కొన్నాడు. తన నియంత్రణలో లేని వాటిపై దృష్టి పెట్టనని వివరించాడు. జట్టు విజయానికి అవసరమైన పరుగులు చేయడమే ముఖ్యమని.. సెంచరీలు కాదని వెల్లడించాడు. ఐసీసీ ప్రవేశపెట్టిన టెస్టు ఛాంపియన్‌షిప్‌లో 17 మ్యాచులాడిన అతడు 1095 పరుగులు చేసిన సంగతి తెలిసిందే.మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి

7. Economy: కరోనా సెకండ్‌ వేవ్‌తో 2లక్షల కోట్ల నష్టం

కరోనా సెకండ్‌ వేవ్‌ దేశంలో ఆర్థిక సంక్షోభాన్ని సృష్టించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సుమారు రూ.2 లక్షల కోట్లక మేరకు నష్టం వాటిల్లిందని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ( ఆర్బీఐ) తమ నెలవారీ బులెటిన్‌ (జూన్‌-2021)లో పేర్కొంది. చిన్న పట్టణాలు, గ్రామాలకు కూడా వైరస్‌ వ్యాపించడంతో ఈ పరిస్థితి నెలకొందని వారు తెలిపారు. దేశ ఆర్థిక వ్యవస్థ కరోనా సెకండ్‌వేవ్‌ నుంచి కోలుకొనేందుకు ప్రయత్నిస్తుందన్నారు.మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి

8. KL Rahul: అతియాతో మరింత చనువుగా..!

టీమ్‌ఇండియా స్ట్రోక్‌ప్లేయర్‌ కేఎల్‌ రాహుల్‌, బాలీవుడ్‌ ముద్దుగుమ్మ అతియా శెట్టి ప్రేమ పక్షులని ఇండస్ట్రీలో ఎప్పట్నుంచో గుసగుసలు వినిపిస్తూనే ఉన్నాయి. వాటిని మరింత బలపరిచే సన్నివేశం మరొకటి చోటుచేసుకుంది. రాహుల్‌, అతియా కలిసి తొలిసారి ఓ ప్రకటనలో నటించారు. వారిద్దరూ ఎంతో సరదాగా.. సన్నిహితంగా గడిపారు. ‘నుమి ప్యారిస్’ విలాసవంతమైన కళ్లద్దాల యాడ్‌లో వీరిద్దరూ హొయలు పోయారు. ఇదే అదనుగా సునిల్‌ శెట్టి తెరమీదకు వచ్చాడు.మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి

9. అందుకే ఆంధ్రాలో తొలి ఆక్సిజన్‌ ప్లాంట్‌: సోనూసూద్‌

సోనూభాయ్‌.. దేశంలో ఇప్పుడు ఎవరికి ఏ కష్టమోచ్చినా తలచుకుంటున్న తొలి పేరు. పిలిస్తే పలుకుతా అంటూ.. ఎవరు ఎప్పుడు సాయం కోరినా.. తనకు తోచినంత తోడ్పాటు అందిస్తూ శభాష్‌ అనిపించుకుంటున్నారు. తెరపై ప్రతినాయకుడి పాత్రలు పోషించిన ఆయన ఈ కరోనా కష్టకాలంలో సూపర్‌ హీరో అయ్యారు. వలస కార్మికులను సొంతగూటికి చేర్చడంతో పాటు ఆకలితో అలమటించే నిరుపేదల కడుపు నింపడం వరకూ ఆయన చేయని పని లేదు.మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి

10. HCA: ఉద్దేశపూర్వకంగానే నోటీసులు: అజహర్‌

ఉద్దేశపూర్వకంగానే తనకు నోటీసులు ఇచ్చారని హెచ్‌సీఏ అధ్యక్షుడు మహమ్మద్ అజహరుద్దీన్‌ అన్నారు. హెచ్‌సీఏ గౌరవానికి భంగం కలిగేలా తానెప్పుడూ పనిచేయలేదని చెప్పారు. అపెక్స్‌ కౌన్సిల్‌లో తొమ్మిది మంది సభ్యులు ఉంటే వారిలో ఐదుగురు ఓ వర్గంగా ఏర్పడి తాము చేసిందే అపెక్స్‌ కౌన్సిల్‌ నిర్ణయంగా భావిస్తే ఎలా అని ప్రశ్నించారు. హెచ్‌సీఏలో జరుగుతున్న అవినీతిని అరికట్టడానికి సమర్థమైన వ్యక్తిని అంబుడ్స్‌మెన్‌గా నియమిస్తే ఆ ఐదుగురే తప్పుపట్టారన్నారు. వాళ్ల అవినీతి బయటపడుతుందనే అలా చేశారని అజహర్‌ ఆరోపించారు. మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని