ప్రభుత్వ జాప్యంతో ప్రజలకు ఇబ్బంది: హైకోర్టు
close

తాజా వార్తలు

Updated : 16/06/2021 19:45 IST

ప్రభుత్వ జాప్యంతో ప్రజలకు ఇబ్బంది: హైకోర్టు

హైదరాబాద్‌: రాష్ట్ర కాలుష్య నియంత్రణ అప్పీలేట్‌ అథారిటీని రెండు వారాల్లో ఏర్పాటు చేయాలని తెలంగాణ హైకోర్టు మరోసారి ఆదేశించింది. ఆదేశాలు అమలు కాకపోతే తదుపరి విచారణకు పర్యావరణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్‌ హాజరై ... కోర్టు ధిక్కరణ చర్యలు ఎందుకు చేపట్టరాదో వివరణ ఇవ్వాలని స్పష్టం చేసింది. 

రాష్ట్రంలో కాలుష్య నియంత్రణ అప్పీలేట్‌ అథారిటీ ఏర్పాటు చేయాలని దాఖలైన పలు ప్రజా ప్రయోజన వ్యాజ్యాలపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ హిమా కోహ్లి, జస్టిస్‌ విజయసేన్‌రెడ్డి ధర్మాసనం ఇవాళ మరోసారి విచారణ చేపట్టింది. మరో వారం రోజులు గడువు కావాలని ఏజీ బీఎస్‌ ప్రసాద్‌ కోరడంపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. విశ్రాంత హైకోర్టు న్యాయమూర్తి పేరును సిఫార్సు చేసినప్పటికీ .. గౌరవ వేతనం ఖరారు చేసి నియామకం చేపట్టేందుకు జాప్యం ఎందుకని ప్రశ్నించింది. ప్రభుత్వం చేస్తున్న జాప్యం వల్ల అంతిమంగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారని వ్యాఖ్యానించింది. విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని