Corona: తితిదే మాజీ ప్రధాన అర్చకుడు మృతి
close

తాజా వార్తలు

Published : 03/05/2021 22:27 IST

Corona: తితిదే మాజీ ప్రధాన అర్చకుడు మృతి

తిరుమల: తిరుమలలోని మిరాశి కుటుంబానికి శ్రీవారి ఆలయ మాజీ ప్రధాన అర్చకుడు శ్రీనివాస నారాయణ దీక్షితులు (75) కరోనా బారిన పడి సోమవారం రాత్రి మృతి చెందారు. మిరాశి కుటుంబాలకు ప్రభుత్వం పదవీ విరమణను రద్దు చేయడంతో నెల క్రితమే ఆయన తిరిగి తితిదేలో విధుల్లో చేరారు. కొన్నిరోజుల కిందట కరోనా బారిన పడటంతో కుటుంబ సభ్యులు తిరుపతిలో స్విమ్స్‌ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సోమవారం ఆరోగ్యం క్షీణించి ఆయన మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. నారాయణ దీక్షితులు మృతి పట్ల తితిదే ఉన్నతాధికారులు శ్రీవారి ఆలయ మిరాశి కుటుంబ సభ్యులు తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు.

శ్రీనివాస నారాయణ దీక్షితులు మృతి పట్ల సీఎం జగన్‌ సంతాపం తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు భగవంతుడు మనో ధైర్యం ఇవ్వాలని ప్రార్థించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని