close

ప్రధానాంశాలు

క్రిస్‌గేల్‌ + కేఎల్‌ రాహుల్‌ = పీడకల

ముంబయి: కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ ఓపెనర్లు క్రిస్‌గేల్‌, కేఎల్‌ రాహుల్‌ క్రీజులో నిలిస్తే ప్రత్యర్థులకు పీడకలేనని ఆ జట్టు బౌలింగ్‌ కోచ్‌ రేయాన్‌ హ్యారిస్‌ అన్నాడు. ఈ ద్వయానికి మంచి అనుభవం, సమన్వయం ఉందని వెల్లడించాడు.

‘వారిద్దరూ (రాహుల్‌, గేల్‌) ప్రతిభావంతులు. అనుభజ్ఞులు. క్రిస్‌ నిలిచిన ప్రతిసారీ పరుగులు చేస్తాడు. ఇంగ్లాండ్‌లో ఇంగ్లాండ్‌పై అతడి ప్రదర్శన అనూహ్యం. వెస్టిండీస్‌ కోసం అతడు చాలా పరుగులు చేశాడు. క్రిస్‌కు ఎంతో ఆత్మవిశ్వాసం ఉంది. ఈ సీజన్‌లో కింగ్స్‌ ఎలెవన్‌కు శుభారంభాలు అందించాడు. మాకున్న మరో గొప్ప ఆటగాడు కేఎల్‌ రాహుల్‌. మంచి అనుభవం, ప్రతిభ అతడి సొంతం. వీరిద్దరూ క్రీజులో నిలిస్తే ప్రత్యర్థికి ఆ రోజు పీడకలే. మూడో స్థానంలో మయాంక్‌ అగర్వాల్‌ సైతం అద్భుతంగా ఆడుతున్నాడు. పరిస్థితులకు అర్థంచేసుకొని పరుగులు చేస్తున్నాడు’ అని హ్యారిస్‌ అన్నాడు.

ఐపీఎల్‌ 12వ సీజన్‌లో ఇప్పటి వరకు అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడు కేఎల్‌ రాహుల్‌. తొమ్మిది మ్యాచుల్లో 387 పరుగులు చేశాడు. క్రిస్‌గేల్‌ ఎనిమిది మ్యాచుల్లో 352 పరుగులతో ఆరో స్థానంలో ఉన్నాడు. కేఎల్‌ శతకం బాదగా గేల్‌ 99తో అజేయంగా నిలవడం గమనార్హం.



మరిన్ని

దేవతార్చన

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Margadarsi Computers.
For Editorial Feedback - eMail: infonet@eenadu.net