ప్రధానాంశాలు

Published : 12/05/2021 10:46 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
Rishabh Pant: యే దిల్‌ మాంగే మూవర్‌!

ఇంటర్నెట్‌ డెస్క్‌: టీమ్‌ఇండియా యువ వికెట్‌ కీపర్‌ రిషభ్ పంత్‌ ఇంగ్లాండ్‌ పర్యటనకు చురుగ్గా సన్నద్ధమవుతున్నాడు. ఇంట్లోనే ఉంటు కసరత్తులు చేస్తున్నాడు. దేహదారుఢ్యం సరిగ్గా ఉంచుకొనేందుకు శ్రమిస్తున్నాడు.

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో రిషభ్ పంత్‌ దిల్లీ క్యాపిటల్స్‌కు చక్కగా సారథ్యం వహించాడు. లీగ్‌ నిరవధికంగా వాయిదా పడటంతో అతడు ఇంటికి చేరుకున్నాడు. బయట పరిస్థితులు బాగా లేకపోవడంతో ఎక్కడికీ వెళ్లడం లేదు. ఇంట్లోనే  క్వారంటైన్‌ అయ్యాడు. జిమ్‌లు లేకపోవడం, క్రీడా మైదానాలు మూసేయడంలో ఇంటివద్దే కసరత్తులు చేస్తున్నాడు.

ఇంటి వద్ద ఉన్న మైదానంలో గడ్డిని చదును చేసే మూవర్‌ను అటు ఇటూ తిప్పుతున్న వీడియోను పంత్‌ ట్వీట్‌ చేశాడు. ‘యే దిల్‌ మాంగే ‘‘మూవర్‌’’! క్వారంటైన్‌కు విరామం ఇవ్వక తప్పలేదు. అయితే ఇండోర్‌లో చురుగ్గా ఉండేందుకు ప్రయత్నించడం సంతోషకరం. ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండండి’ అని వ్యాఖ్య పెట్టాడు.

ఇంగ్లాండ్‌ పర్యటనలో రిషభ్ పంత్‌ అత్యంత కీలకం కానున్నాడు. జట్టుకు అతడు ఎక్స్‌ ఫ్యాక్టర్‌గా ఉంటున్నాడు. ఒత్తిడి చిత్తు చేస్తున్నా దూకుడుగా బ్యాటింగ్‌ చేయగల అతడి సామర్థ్యం కోహ్లీసేనకు కొండంత బలం. గతంలోనూ అతడు ఇంగ్లాండ్‌ సిరీసులో పరుగుల వరద పారించాడు. అంతేకాకుండా ఆసీస్‌లో సిరీసు గెలిపించాడు. ఇప్పుడు మరో సారి ఆంగ్లేయులపై ఆధిపత్యం చెలాయించేందుకు సిద్ధమవుతున్నాడు.


1392152269685096453

ఇవీ చదవండి

Tags :

మరిన్ని

తాజా వార్తలు

మరిన్ని
బిజినెస్‌
మరిన్ని
సినిమా
మరిన్ని

చిత్ర వార్తలు

© 1999 - 2021 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers
For Editorial Feedback - eMail: infonet@eenadu.net