ప్రధానాంశాలు

Published : 01/06/2021 01:39 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
IPL: వార్నర్‌, కమిన్స్‌.. ఇది కదా ప్రేమంటే!

ఇంటర్నెట్‌డెస్క్‌: ఐపీఎల్‌ 14వ సీజన్‌ బయోబుడగలో పలువురు ఆటగాళ్లు కరోనా బారినపడటంతో టోర్నీని మే 4న నిరవధికంగా వాయిదా వేసిన సంగతి తెలిసిందే. దాంతో అన్ని జట్ల ఆటగాళ్లంతా అప్పుడే ఎవరిళ్లకు వారు వెళ్లిపోగా ఆస్ట్రేలియా క్రికెటర్లు, సహాయక సిబ్బంది ఎట్టకేలకు ఇళ్లకు చేరుకున్నారు. ఈ సందర్భంగా వారు తమ కుటుంబ సభ్యులను కలుసుకొని తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. అయితే డేవిడ్‌ వార్నర్‌, పాట్‌ కమిన్స్‌ తమ ఆత్మీయులను కలుసుకున్న వీడియోలు ఇప్పుడు నెట్టింట్లో వైరల్‌గా మారాయి. ఎందుకంటే.. వార్నర్‌ తన ముగ్గురు చిన్నారి కూతుళ్లను హత్తుకోగా, కమిన్స్‌ గర్భవతి అయిన తన భార్యను ప్రేమతో దగ్గరికి తీసుకున్నాడు. సుమారు రెండు నెలలు వారు ఇంటికి దూరమవడంతో ఒక్కసారిగా భావోద్వేగానికి గురయ్యారు.

మరోవైపు ఈ సీజన్‌లో ఇప్పటివరకు 29 మ్యాచ్‌లు జరగ్గా ఇంకా 31 మ్యాచ్‌లు పూర్తి చేయాల్సి ఉంది. వాటిని సెప్టెంబర్‌లో యూఏఈలో నిర్వహించాలని బీసీసీఐ ప్రణాళికలు రూపొందిస్తోంది. ఆ మేరకు తగిన ఏర్పాట్లు కూడా మొదలుపెట్టింది. టీమ్‌ఇండియా ఇంగ్లాండ్‌ పర్యటన అనంతరం మిగిలిన మ్యాచ్‌లను కొనసాగించాలని చూస్తోంది. అయితే, అప్పుడు పలువురు విదేశీ ఆటగాళ్లు పాల్గొనే అవకాశం కనిపించడం లేదు. అందులో ప్రధానంగా ఇంగ్లాండ్‌, ఆస్ట్రేలియా క్రికెటర్లు విముఖత వ్యక్తం చేసే వీలుంది. ఇప్పటికే ఇంగ్లాండ్‌ బోర్డు తమ ఆటగాళ్లను అనుమతించమని చెప్పింది. ఆ సమయంలో ఇతర అంతర్జాతీయ మ్యాచ్‌లు ఉండటంతో తమ క్రికెటర్లను పంపించలేమని చెప్పింది. ఇక ఆస్ట్రేలియా సైతం ఈ విషయంపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పింది. దాంతో ఈ రెండు జట్ల ఆటగాళ్లు ఐపీఎల్‌ తిరిగి మొదలైతే ఆడడం కష్టమనే చెప్పాలి.1399228501895483396

ఇవీ చదవండి

Tags :

మరిన్ని

తాజా వార్తలు

మరిన్ని
బిజినెస్‌
మరిన్ని
సినిమా
మరిన్ని

చిత్ర వార్తలు

© 1999 - 2021 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers
For Editorial Feedback - eMail: infonet@eenadu.net