మంత్రాల నెపంతో మారణహోమం
close

తాజా వార్తలు

Published : 31/10/2020 00:52 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మంత్రాల నెపంతో మారణహోమం

ముగ్గురి తల నరికి చంపిన గ్రామస్థులు

రాంచి: మంత్రాలు చేస్తున్నారన్న నెపంతో ముగ్గురు కుటుంబసభ్యులను ఎత్తుకెళ్లిన గ్రామస్థులు వారి తల నరికి అతి కిరాతకంగా హత్య చేశారు. ఝార్ఖండ్‌ రాష్ట్రం ఖుంతి జిల్లాలో ఈ దారుణం చోటుచేసుకుంది. ఖుంతిలోని ఓ గ్రామంలో కొద్దిరోజుల క్రితం ఓ మహిళ శిశువుకు జన్మనిచ్చింది. అయితే ఆ శిశువు కొద్దిరోజులకే మరణించింది. కాగా శిశువు మరణానికి బిర్సా ముండా కుటుంబం చేస్తున్న మంత్రాలే కారణమని స్థానికంగా ఉండే మతగురువు పేర్కొన్నాడు. దీంతో ఈ నెల మొదటివారంలో బిర్సా ముండా కుటుంబాన్ని దుండగులు ఎత్తుకెళ్లారు. బిర్సా ముండా(48)తోపాటు ఆయన భార్య సుక్రుపూర్తీ(43), వారి కుమార్తె సోమ్‌వార్‌ పూర్తీ (20)ని అపహరించారు. ఊరు వెళ్లి తిరిగొచ్చిన బిర్సా ముండా మరో కుమార్తెకు ఇంట్లో ఎవరూ కనిపించలేదు. అనుమానం వ్యక్తం చేసిన ఆమె పోలీసులను ఆశ్రయించడంతో అపహరణ విషయం వెలుగులోకి వచ్చింది. దర్యాప్తు చేపట్టడంతో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. అపహరించిన ముగ్గురిని అడవిలోకి తీసుకెళ్లిన దుండగులు వారి తలలు నరికి అత్యంత దారుణంగా హతమార్చారు. అనంతరం ఆ తలలను పలు ప్రాంతాల్లో పడేశారు.

డాగ్‌స్క్వాడ్‌ సాయంతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు తలలతోపాటు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. 9 మందిని నిందితులుగా గుర్తించి ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. మిగతావారి కోసం గాలిస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం తరలించారు.
 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని