బారికేడ్‌ గ్రిల్‌ మధ్య ఇరుక్కుపోయిన బాలిక తల
close

తాజా వార్తలు

Published : 04/04/2021 15:21 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

బారికేడ్‌ గ్రిల్‌ మధ్య ఇరుక్కుపోయిన బాలిక తల

భువనేశ్వర్‌: ఒడిశాలోని పూరీ జగన్నాథ ఆలయ బారికేడ్ గ్రిల్ మధ్య నాలుగేళ్ల బాలిక తల ఇరుక్కుపోయింది. కళహండి జిల్లాకు చెందిన రామ్ నారాయణ్ రాథ్ కుటుంబంతో కలిసి పూరీ జగన్నాథుని దర్శించుకొన్నారు. అనంతరం స్టోర్ రూమ్‌లో సెల్‌ఫోన్‌ను తీసుకోవడానికి వెళ్లారు. అక్కడే ఆడుకుంటున్న ఆయన కుమార్తె అగ్ని అంబిక ఆటలో భాగంగా బారికేడ్ గ్రిల్ మధ్య తల పెట్టగా తల అందులో ఇరుక్కుపోయింది. గ్రిల్‌ మధ్య ఇరుక్కుపోయిన తలను బయటకు తీసేందుకు అక్కడి వారు ప్రయత్నించినా వీలుకాలేదు. అప్రమత్తమైన తల్లిదండ్రులు అధికారులకు సమాచారం అందించగా అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగారు. గ్యాస్ కట్టర్ సాయంతో ఇనుప కడ్డీని కత్తిరించగా పాప తల సురక్షితంగా బయటపడింది. దీంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని