99 శాతం ఐఈసీయూ బెడ్స్‌ ఫుల్‌!!
close

తాజా వార్తలు

Published : 14/06/2020 00:51 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

99 శాతం ఐఈసీయూ బెడ్స్‌ ఫుల్‌!!

కరోనాతో ముంబయి విలవిల

ముంబయి: దేశ ఆర్థిక రాజధాని నగరం ముంబయి కరోనా మహమ్మారి కారణంగా విలవిల్లాడుతోంది. రోజూ కొత్తగా వందలాది కేసులు, పదుల సంఖ్యలో మరణాలు ఇక్కడ సంభవిస్తున్నాయి. దీంతో బాధితులతో ఆస్పత్రులు నిండిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ముంబయిలోని ఆస్పత్రుల స్థితిగతులను తెలుపుతూ బృహన్‌ ముంబయి మున్సిపల్‌ కార్పొరేషన్‌ (బీఎంసీ) విడుదల చేసిన గణాంకాలు మరింత భయకంపితులను చేస్తున్నాయి.

మహానగరంలో మొత్తం 1181 ఐసీయూ పడకలు అందుబాటులో ఉండగా.. అందులో జూన్‌ 11 నాటికి 1,167 పడకలు నిండిపోయినట్లు బీఎంసీ పేర్కొంది. కేవలం 14 పడకలు మాత్రమే కొత్తగా వచ్చే పీడితుల కోసం అందుబాటులో ఉన్నాయని తెలిపింది. అంటే దాదాపు 99 శాతం పడకలు బాధితులతో నిండిపోయాయంటే అక్కడి కరోనా విలయ తాండవాన్ని అర్థం చేసుకోవచ్చు. అలాగే, 530 వెంటిలేటర్లకు గానూ 497 (94 శాతం) వినియోగంలో ఉన్నాయని పేర్కొంది. 5,260 ఆక్సిజన్‌ పడకలకు గానూ కేవలం 3,986 (76 శాతం) మాత్రమే అందుబాటులో ఉన్నాయని బీఎంసీ వెల్లడించింది. ఇవికాక కేవలం కొవిడ్‌ బాధితుల కోసం ప్రత్యేకించిన కొవిడ్‌ ఆస్పత్రులు, కొవిడ్‌ హెల్త్‌ కేర్‌ సెంటర్లలో మొత్తం 10,450 పడకలకు గానూ 87 శాతం పడకలు నిండిపోయినట్లు పేర్కొంది.

ఇప్పటికే ముంబయి మహా నగరంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 50వేలు దాటింది. మరోవైపు మహారాష్ట్ర వ్యాప్తంగా కేసుల సంఖ్య లక్ష దాటింది. మరోవైపు ప్రైవేటు ఆస్పత్రుల్లో కొవిడ్‌ -19 పరీక్షల రుసుంను ఆ రాష్ట్ర ప్రభుత్వం తగ్గించింది. ఇప్పటి వరకు రూ.4500గా ఉన్న రుసుమును రూ.2200కు తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఒకవేళ ఇంటి వద్ద నమూనాలు సేకరిస్తే మాత్రం రూ.2800 వసూలు చేయనున్నారు. అంతకుముందు ఈ ఛార్జీ రూ.5,200గా ఉండేది. ప్రజలపై భారం తగ్గించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి రాజేశ్‌ తోపే వెల్లడించారు.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని