close
Array ( ) 1

తాజా వార్తలు

Updated : 05/06/2020 13:10 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాప్‌ 10 న్యూస్ @ 1 PM

1. సుధాకర్‌ డిశ్చార్జికి హైకోర్టు అనుమతి

డాక్టర్‌ సుధాకర్‌ తల్లి ఏపీ హైకోర్టులో దాఖలు చేసిన హెబియస్‌ కార్పస్‌ హౌస్‌ మోషన్‌ పిటిషన్‌పై శుక్రవారం విచారణ జరిగింది. సుధాకర్‌ను పోలీసులు, సీబీఐ అధికారులు అరెస్టు చేయలేదని,  అలాంటప్పుడు ఏ ప్రాతిపదికన ఆసుపత్రిలో బంధించారని సుధాకర్‌ తల్లి పిటిషన్‌లో పేర్కొన్నారు. ఇరు వైపులా వాదనలు విన్న తర్వాత .. వైద్యుడు సుధాకర్‌ డిశ్చార్జికి ఉన్నత న్యాయస్థానం సమ్మతించింది. ఆసుపత్రి సూపరింటెండెంట్‌కు తెలియజేసి సుధాకర్‌ ఎప్పుడైనా డిశ్చార్జి కావొచ్చని స్పష్టం చేసింది. సీబీఐ విచారణకు సహకరించాలని సుధాకర్‌కు న్యాయస్థానం సూచించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. ఒకేరోజు 9851 కేసులు, 273 మరణాలు!

భారత్‌లో కరోనా వైరస్‌ విస్తృత వేగంతో వ్యాపిస్తోంది. దేశంలో రోజురోజుకూ రికార్డుస్థాయిలో పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. నిన్న ఒక్కరోజే అత్యధికంగా దాదాపు 10వేల పాజిటివ్‌ కేసులు బయటపడ్డాయి. భారత్‌లో కరోనా వైరస్‌ బయటపడిన తర్వాత మొట్టమొదటిసారిగా 24గంటల్లో 9851 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో శుక్రవారం నాటికి దేశంలో కొవిడ్‌-19 బారినపడ్డ వారిసంఖ్య 2,26,770కి చేరిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ ప్రకటించింది. మరణాల సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. పర్యావరణం కంటికి కనిపించని సంపద: పవన్‌

పర్యావరణ పరిరక్షణ జనసేన మూల సిద్ధాంతమని ఆ పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రకృతి ప్రేమికులకు అభినందనలు తెలిపారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. పర్యావరణం కంటికి కనిపించని విలువైన సంపద అని.. ఈ సంపదను భావితరాలకు అందించాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. నింగి, నీరు, నేల, నిప్పు, గాలితో సమ్మిళితమైన పర్యావరణాన్ని పరిరక్షించుకున్నప్పుడే మానవజాతి శోభిల్లుతుందన్నారు. అడవులు, కొండలు, నదులను కాపాడుకోవాలని సూచించారు. మన ఆరోగ్యం పర్యావరణంతోనే ముడిపడి ఉందన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. జియోలో మరో కంపెనీ భారీ పెట్టుబడులు..

కరోనా సంక్షోభంలోనూ రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌(ఆర్‌ఐఎల్‌)కు చెందిన జియో ప్లాట్‌ఫామ్స్‌లోకి పెట్టుబడులు భారీగా వస్తున్నాయి. ఇప్పటికే ఫేస్‌బుక్‌, సిల్వర్‌ లేక్‌ వంటి బడా కంపెనీలను ఆకర్షించిన జియో తాజాగా అబుదాబికి చెందిన ముబాదల నుంచి కూడా పెట్టుబడులను రాబట్టింది. జియో ప్లాట్‌ఫామ్స్‌లో రూ.9,093.6 కోట్ల పెట్టుబడుల ద్వారా 1.85 శాతం వాటాను కైవసం చేసుకునేందుకు ముబాదల ముందుకు వచ్చింది. ఈ విషయాన్ని శుక్రవారం ఆర్‌ఐఎల్‌ స్వయంగా ప్రకటించింది. ఇప్పటి వరకు వివిధ కంపెనీల నుంచి జియోలోకి రూ.87,655 కోట్ల పెట్టుబడులు వచ్చి చేరాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. ఆప్‌లోకి సిద్దూ?

పంజాబ్‌ మాజీ మంత్రి నవజ్యోత్‌ సింగ్‌ సిద్దూ పార్టీ మారనున్నారనే ఊహాగానాలు ఇప్పటికే ఊపందుకున్నాయి. ‘ఆయన వస్తే సాదరంగా స్వాగతిస్తాం’ అంటూ తాజాగా ఆమ్‌ ఆద్మీ పార్టీ(ఆప్‌) జాతీయ కన్వీనర్‌, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ చేసిన వ్యాఖ్యలు ఆ ఊహాగానాలకు మరింత బలాన్ని చేకూర్చాయి. ఈ మేరకు ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌తో సంప్రదింపులు కూడా జరుపుతున్నట్లు దిల్లీ వర్గాల్లో చర్చలు నడుస్తున్నాయి. తొలుత భాజపాలో ఉన్న సిద్దూ 2017 పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నిక‌ల నాటికి కాంగ్రెస్ గూటికి చేరిన విషయం తెలిసిందే. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. పాముపై కప్ప సవారీ..

7. 43లక్షల కరోనా నిర్ధారణ పరీక్షలు: ఐసీఎంఆర్‌

దేశంలో కరోనా వైరస్‌ మహమ్మారి విజృంభణతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను అప్రమత్తం చేస్తున్నాయి. తాజాగా కేసుల తీవ్రత పెరుగుతున్న తరుణంలో కరోనా నిర్ధారణ పరీక్షలు కూడా ముమ్మరంగా చేపడుతున్నారు. ఇప్పటివరకు దేశంలో 43లక్షల 86వేల  శాంపిళ్లను పరీక్షించినట్లు భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్‌) వెల్లడించింది. గడచిన 24గంటల్లోనే 1,43,661 శాంపిళ్లు పరీక్షించినట్లు ఐసీఎంఆర్‌ తెలిపింది. అయితే,  ఈనెల 8 నుంచి దేశవ్యాప్తంగా దేవాలయాలు, ప్రార్థనా మందిరాలు, షాపింగ్‌ మాల్స్‌, రెస్టారెంట్లు తెరచుకోనుండడంతో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వీటికి సంబంధించిన తాజా మార్గదర్శకాలను కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే జారీచేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. ద్రవిడ్‌ను యువీలా ఆడించలేం: గంగూలీ

అత్యుత్తమ సారథులు తమ తప్పుల నుంచే నేర్చుకుంటారని బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్‌ గంగూలీ అన్నాడు. నాయకత్వ లక్షణాలపై ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ..  ద్రవిడ్‌ను యువీలా ఆడించలేమని, అలాగే యువీని కూడా ద్రవిడ్‌లా ఆడమని చెప్పలేమన్నాడు. దేన్నైనా అందిపుచ్చుకోవడం నాయకత్వ లక్షణాల్లో కీలకమని వ్యాఖ్యానించాడు. పరిస్థితులకు తగ్గట్టు నెట్టుకుపోవడం సారథ్య లక్షణాల్లో ముఖ్యమైన విషయమని చెప్పాడు. అలాగే జట్టు సభ్యుల్లోని సహజ నైపుణ్యాలను గుర్తించాలని, యువరాజ్‌ సింగ్‌ను ద్రావిడ్‌లా మార్చలేమని.. యువీని కూడా ద్రవిడ్‌లా ఆడించలేమని దాదా వివరించాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. ఆ ఏనుగు మృతికి ఇదే కారణం..

కేరళలోని పాలక్కడ్‌ జిల్లాలో గర్భిణి ఏనుగు మృతి ఘటనపై దేశవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమవుతోంది. జంతువుల పట్ల అమానుష ప్రవర్తనపై సామాజిక మాధ్యమాల్లో పెద్దఎత్తున చర్చలు మొదలయ్యాయి. తాజాగా ఆ ఏనుగు పోస్టుమార్టం ప్రాథమిక నివేదిక బయటకు వచ్చింది. పేలుడుపదార్థాలు కలిగిన పైనాపిల్‌ తినడం వల్లే నోటిలో తీవ్ర గాయాలయ్యాయని తేలింది. ఈ క్రమంలోనే అది నొప్పిని భరిస్తూ 14 రోజుల పాటు ఏమీ తినకుండా, తాగకుండా ఆకలితో అలమటించిందని నివేదికలో పేర్కొన్నారు. ‘అలా ఒకరోజు మొత్తం నదిలో ఉండి, చివరకు నీరసించి అక్కడే నీటిలో పడి పోయింది. ఊపిరి తిత్తుల వైఫల్యమే ఏనుగు మృతికి కారణం’’ అని పోస్టుమార్టం నిర్వహించిన వైద్యులు తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. ఇండియన్‌ టిక్‌టాక్‌ ‘మిత్రోన్’ కహానీ

కరోనా సంక్షోభం కారణంగా ప్రజలు సినిమాలు, వినోదం, పర్యాటకానికి దూరమయ్యారు. అదే సమయంలో చిన్న నిడివి గల వీడియో షేరింగ్ యాప్‌ ‘టిక్‌ టాక్‌’కు బాగా ఆకర్షితులయ్యారు. ఓటీటీ ఫ్లాట్‌ఫామ్స్‌లో ఉన్న సినిమాలను చూసేయడం.. కొత్త సినిమాలు రాకపోవడంతో చాలా మంది టిక్‌టాక్‌ వీడియోలు చేస్తూ కాలక్షేపం చేస్తున్నారు. సామాన్యుల నుంచి మొదలుకొని సెలబ్రిటీల వరకూ టిక్‌టాక్‌ వీడియోలు చేయడంలో మునిగి తేలిపోతున్నారు. ఇంత వరకు బాగానే ఉన్నా.. ఇటీవల టిక్‌టాక్‌కు భారత్‌లో వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. దీనికి ఒక కారణం టిక్‌టాక్‌ చైనాకు చెందిన యాప్ కావడం. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.