
తాజా వార్తలు
రైతుల ఉద్యమానికి ఏఐఐఈఏ సంఘీభావం
హైదరాబాద్: నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ దేశ రాజధాని దిల్లీలో రైతులు చేస్తున్న ఉద్యమానికి సంఘీభావం తెలుపుతున్నట్లు అఖిల భారత బీమా ఉద్యోగుల సంఘం (ఏఐఐఈఏ) ప్రకటించింది. భారత ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక అయిన రైతుల ఉద్యమాన్ని క్రూరంగా అణిచివేసేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని ఆరోపించింది. రైతులతో చర్చలు జరిపి, వారి డిమాండ్లకు న్యాయం చేయాలని పేర్కొంది. కనీస మద్దతు ధర పొందడం రైతులకు న్యాయపరమైన హక్కుగా చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఒక ప్రకటనలో తెలిపింది. శాంతియుతంగా రైతులు చేస్తున్న ఉద్యమాన్ని అణిచివేయాలనుకుంటే దేశంలో ఆహార భద్రతతోపాటు ఇతర జాతీయ ప్రయోజనాలకూ విఘాతం కలుగుతుందని పేర్కొంది.
Tags :
జిల్లా వార్తలు