close
Array ( ) 1

తాజా వార్తలు

లాక్‌డౌన్‌..ఏపీలో ఆకతాయిలపై 338 కేసులు

కరోనా నివారణకు ఇంటింటికీ కరపత్రాలు

మంత్రి పేర్ని నాని వెల్లడి

అమరావతి: కరోనా వైరస్‌ నివారణకు విస్తృత ప్రచారం కల్పిస్తామని ఏపీ మంత్రి పేర్ని నాని తెలిపారు. ఈ వైరస్‌ను కట్టడి చేసేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఇంటింటికీ కరపత్రాలు పంపిణీ చేస్తామని ఆయన చెప్పారు. సరదా కోసం యువకులు రోడ్లపైకి రావొద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. లాక్‌డౌన్‌ నిబంధనలను అతిక్రమించినందున ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా ఆకతాయిలపై 338 కేసులు నమోదు చేయడంతో పాటు 288 వాహనాలను సీజ్‌ చేసినట్లు నాని వివరించారు. అమరావతి సచివాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. చిన్నారులకు అందించాల్సిన పౌష్టికాహారాన్ని ఇళ్ల వద్దకే అంగన్వాడీ సిబ్బంది అందజేస్తారని చెప్పారు.

కరోనా అనుమానిత లక్షణాలుంటే 104కు ఫోన్‌ చేయాలని మంత్రి సూచించారు. అత్యవసర సేవలు 24 గంటలూ కొనసాగుతాయని స్పష్టం చేశారు. ఇంటర్‌ పరీక్షల స్పాట్‌ వాల్యూయేషన్‌ను వాయిదా వేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. రాత్రి 8 నుంచి ఉదయం 6 గంటల వరకు ఏ ఒక్కరూ బయటకు రాకుండా నిషేధం విధించామని చెప్పారు. ఈ రాత్రి నుంచి అంతర్‌ జిల్లాల రవాణాను కూడా నిలిపివేస్తున్నామన్నారు.
లాక్‌డౌన్‌ విధించడంతో రాష్ట్రంలో ఏప్రిల్‌ 1 తర్వాత ఇవ్వాల్సిన రేషన్‌ను ఈ నెల 29నే ఇస్తామని నాని తెలిపారు. పేదలకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు తెల్ల రేషన్‌ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి ఏప్రిల్‌ 4న రూ.1000 చొప్పున అందజేయనున్నట్టు స్పష్టంచేశారు. పింఛను యథాతథంగా చెల్లిస్తారని.. వేలిముద్రలు లేకుండానే గ్రామ వాలంటీర్లు ఇంటికి వచ్చి ఇస్తారని చెప్పారు. 


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.