close

తాజా వార్తలు

Published : 31/07/2020 10:16 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

నిఖిల్‌తో జోడీ కట్టేందుకు? 

హైదరాబాద్: వైవిధ్యభరిత చిత్రాలతో మెప్పిస్తూ కథానాయకుడిగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సాధించుకున్నారు నిఖిల్‌. ఇప్పుడాయన కథానాయకుడిగా పల్నాటి సూర్య ప్రతాప్‌ దర్శకత్వంలో ‘18 పేజీస్‌’ చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. బన్నీ వాసు నిర్మిస్తున్నారు. దీనికి ప్రముఖ దర్శకుడు సుకుమార్‌ కథ అందిస్తున్నారు. ఇప్పటికే లాంఛనంగా ప్రారంభమైన ఈ చిత్రం త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లబోతుంది. 

ఈ నేపథ్యంలోనే ఇప్పుడిందులో నిఖిల్‌కు జోడీగా నటించబోయే నాయిక కోసం వేట ముమ్మరం చేసింది చిత్ర బృందం. తాజాగా అందుతోన్న సమాచారం ప్రకారం.. ఆ పాత్ర కోసం మలయాళ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్‌ను సంప్రదిస్తోన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం నిఖిల్‌ ఈ చిత్రంతో పాటు ‘కార్తికేయ 2’లోనూ నటిస్తున్నారు.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.