జగిత్యాల: గొల్లపల్లి పోలీస్‌స్టేషన్‌ వద్ద ఉద్రిక్తత
close

తాజా వార్తలు

Published : 30/12/2020 19:44 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

జగిత్యాల: గొల్లపల్లి పోలీస్‌స్టేషన్‌ వద్ద ఉద్రిక్తత

గొల్లపల్లి: జగిత్యాల జిల్లా గొల్లపల్లిలో మంత్రి కొప్పుల ఈశ్వర్‌ పర్యటనను అడ్డుకునేందుకు యత్నించిన భాజపా కార్యకర్తలు, నాయకులను ముందస్తుగా అరెస్టు చేయడంతో స్థానిక పోలీసుస్టేషన్‌ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. అరెస్ట్‌ అయిన భాజపా కార్యకర్తలు, నాయకులు స్టేషన్‌ గేటు దాటుకుని వచ్చేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. ఈ క్రమంలో అక్కడ విధులు నిర్వహిస్తున్న కొంతమంది పోలీసులు కిందపడ్డారు. అక్కడే ఉన్న డీఎస్పీ వెంకటరమణ, సీఐ రామచందర్‌రావు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఆ తర్వాత పరిస్థితి సద్దుమణిగింది. 

ఇవీ చదవండి..

తెరాస, భాజపా కార్యకర్తల బాహాబాహీ

సర్పంచి పదవికి వేలం.. ఎన్ని కోట్లో తెలుసా!

 


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని