close

తాజా వార్తలు

Updated : 20/11/2020 13:31 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

అప్పటికి పరిస్థితి చక్కబడుతుంది: బిల్‌ గేట్స్‌

న్యూయార్క్: కరోనా వైరస్‌ కేసులే కాకుండా మరణాల సంఖ్యలో కూడా అమెరికా ప్రపంచంలోనే ప్రథమ స్థానంలో ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుత పరిస్థితి, గణాంకాలు భయానకంగా ఉన్న మాట నిజమేనని.. ఐతే 2021 వేసవికల్లా ఇక్కడ సాధారణ పరిస్థితి నెలకొనగలదని మైక్రోసాఫ్ట్‌ సహ వ్యవస్థాపకుడు బిల్‌ గేట్స్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. తాజాగా ఓ ముఖాముఖిలో మాట్లాడుతూ.. కొవిడ్‌-19 వ్యాక్సిన్ల అనుమతుల్లో అనుకోని అవరోధాలు తలెత్తితే తప్ప వచ్చే వేసవిలోగా అగ్రరాజ్యంలో పరిస్థితి చక్కబడుతుందని ఆయన అంచనా వేశారు. నేటితో పోలిస్తే అప్పటికి పరిస్థితి చాలా చక్కగా ఉండనుందని ఆయన వెల్లడించారు.

దేశంలోని ప్రతి నగరంలో, పట్టణంలోని కార్యాలయాలు, పార్కులు, రెస్టారెంట్లలో యథాతథ స్థితి నెలకొంటుందని బిల్‌గేట్స్‌ ఆశాభావం వ్యక్తంచేశారు. రానున్న విద్యా సంవత్సరం కూడా ఇంచుమించు సాధారణంగానే ఉంటుందని గేట్స్‌ విశ్లేషించారు. వ్యాక్సిన్ల సరఫరా కార్యక్రమం క్లిష్టమైనదని అంటూ.. ఇప్పటికిప్పుడు కరోనాను అరికట్టేందుకు 10 బిలియన్ల (వెయ్యి కోట్ల) టీకా డోసులు అవసరమౌతాయని గేట్స్‌ వెల్లడించారు. బిల్‌ అండ్‌ మెలిండా గేట్స్‌ ఫౌండేషన్‌ అంతర్జాతీయ కరోనా కట్టడి కార్యక్రమానికి 350 మిలియన్‌ డాలర్లు సహాయం అందిస్తున్న సంగతి తెలిసిందే.

ప్రముఖ ఫార్మా సంస్థలు ఫైజర్‌, మోడెర్నాలు తమ వ్యాక్సిన్‌లు 90 శాతానికి పైగా ప్రభావం చూపుతున్నట్టు ఇటీవల ప్రకటించాయి. ఈ నేపథ్యంలో అమెరికాలో కరోనా టీకాల పంపిణీ డిసెంబర్‌ నెలాఖరు కల్లా మొదలు కావచ్చని అంచనాలు వెలువడుతున్నాయి. నెలల తరబడి భయానక పరిస్థితులు నెలకొన్న ఈ దేశంలో రోజువారీ కేసులు అధికంగానే నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో గేట్స్‌ వ్యాఖ్యలు ఆశాజనకంగా మారాయి.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

చిత్ర వార్తలు

సినిమా
మరిన్ని

దేవతార్చన