మధ్యప్రదేశ్‌లో కొనసాగుతున్న భాజపా ఆధిక్యం
close

తాజా వార్తలు

Published : 10/11/2020 12:32 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మధ్యప్రదేశ్‌లో కొనసాగుతున్న భాజపా ఆధిక్యం

ఇంటర్నెట్‌ డెస్క్: బిహార్‌ సహా దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఉపఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. మధ్యప్రదేశ్‌లో తొలి నుంచీ భాజపా అత్యధిక స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. మొత్తం 28 స్థానాలకు ఉపఎన్నికలు జరగ్గా.. ప్రస్తుతం భాజపా 18 స్థానాల్లో కాంగ్రెస్‌ 8, బీఎస్పీ రెండు స్థానాల్లో ముందంజలో ఉన్నాయి. అధికారాన్ని నిలబెట్టుకోవడానికి భాజపా కేవలం ఎనిమిది స్థానాల్లో గెలుపొందితే సరిపోతుంది. ప్రస్తుత ఫలితాల సరళి భాజపాకు అనుకూలంగా కొనసాగుతోంది. 

ఫలితాలు వెలువడుతున్న తరుణంలో పీసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం కమల్‌నాథ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘నేను మధ్యప్రదేశ్‌ సంక్షేమాన్నే కోరుకుంటున్నాను. సత్యం-అసత్యం మధ్య జరుగుతున్న ఈ పోరులో ప్రజలు స్పష్టమైన తీర్పునిస్తారని నాకు నమ్మకం ఉంది’’ అని వ్యాఖ్యానించారు. తనయుడు నకుల్‌నాథ్‌తో కలిసి ఉదయమే ఆయన కాంగ్రెస్ కార్యాలయానికి చేరుకున్నారు.  

వివిధ రాష్ట్రాల్లో జరిగిన ఉపఎన్నికల ఫలితాల సరళి ఇలా ఉంది... 

* గుజరాత్‌లో ఎనిమిది స్థానాలకు గానూ భాజపా అన్నింటా ఆధిక్యంలో కొనసాగుతోంది.

* ఒడిశాలో రెండు స్థానాలకు ఉపఎన్నికలు జరగ్గా.. బీజేడీ, ఇతరులు చెరో స్థానంలో ముందంజలో ఉన్నారు.

* నాగాలాండ్‌లో రెండు అసెంబ్లీ స్థానాలకు ఉపఎన్నికలు జరిగాయి. రెండింటిలో ప్రధాన పార్టీలేవీ ఆధిక్యంలో లేకపోవడం గమనార్హం. 

* ఉత్తర్‌ప్రదేశ్‌లో ఏడు స్థానాలకు ఉపఎన్నికలు జరిగాయి. ప్రస్తుతం ఐదు స్థానాల్లో భాజపా, ఒకచోట ఎస్పీ, ఒక స్థానంలో ఇతరులు ముందంజలో ఉన్నారు. 

* ఛత్తీస్‌గఢ్‌లో ఒకస్థానానికి ఉపఎన్నిక జరగ్గా కాంగ్రెస్‌ ఆధిక్యత కనబరుస్తోంది. 

* కర్ణాటకలో ఉపఎన్నికలు జరిగిన రెండు స్థానాల్లో భాజపా ముందంజలో కొనసాగుతోంది. 

* ఝార్ఖండ్‌లో రెండు స్థానాలకు ఉపఎన్నికలు జరగ్గా రెండింటిలోనూ భాజపా ఆధిక్యంలో కొనసాగుతోంది.

* మణిపూర్‌లో ఐదు స్థానాలకు ఉపఎన్నికలు జరగాయి. ఇప్పటికే ఒక స్థానంలో భాజపా విజయం సాధించింది. సింఘత్‌ నియోజకవర్గం నుంచి గిన్‌సుహాన్హు గెలుపొందారు. భాజపా మొత్తం మూడు స్థానాల్లో పోటీ చేయగా.. కాంగ్రెస్‌ అన్ని స్థానాల్లో తమ అభ్యర్థుల్ని బరిలో నిలిపింది. 

* హరియాణాలో ఉపఎన్నిక జరిగిన ఒక్కస్థానంలో కాంగ్రెస్‌ ముందంజలో కొనసాగుతోంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని