close
Array ( ) 1

తాజా వార్తలు

త్వరలో చంద్రబాబు ‘ప్రజాచైతన్య యాత్ర’

తెదేపా విస్తృతస్థాయి సమావేశంలో నిర్ణయం

అమరావతి: రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై బస్సు యాత్ర చేపట్టేందుకు తెదేపా అధినేత చంద్రబాబు సిద్ధమవుతున్నారు. ఈనెల 17 నుంచి రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో ప్రజాచైతన్య యాత్ర చేపట్టాలని తెదేపా విస్తృతస్థాయి సమావేశంలో నిర్ణయించారు. సుమారు 45 రోజులపాటు ఇది కొనసాగే అవకాశముంది. ఈ బస్సు యాత్రలో ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించడంతో పాటు, పెట్టుబడులు, మూడు రాజధానులు, సంక్షేమ పథకాల్లో కోత తదితర అంశాలపై ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును చంద్రబాబు ఎండగట్టనున్నారు.  తెదేపా ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌ల ఆధ్వర్యంలో ఈ యాత్రలు నిర్వహించనున్నారు. అయితే బస్సు యాత్రను ఎక్కడి నుంచి ప్రారంభిస్తారనే దానిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. మరో రెండు మూడు రోజుల్లో ఈ యాత్ర రూట్‌ మ్యాప్‌ ఖరారయ్యే అవకాశముంది.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.