Lock Down: దిల్లీలో మళ్లీ పొడిగింపు
close

తాజా వార్తలు

Published : 01/05/2021 18:26 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Lock Down: దిల్లీలో మళ్లీ పొడిగింపు

దిల్లీ: దేశ రాజధాని దిల్లీలో కరోనా విలయతాండవం ఆగడం లేదు. నానాటికీ కేసులు, మరణాలు పెరుగుతూనే ఉన్నాయి. దీంతో వైరస్‌ ఉద్ధృతి దృష్ట్యా ప్రస్తుతం అమలవుతున్న లాక్‌డౌన్‌ను మరో వారం పాటు పొడిగిస్తున్నట్టు దిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రకటించారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు. రాజధాని వాసులు కూడా లాక్‌డౌన్‌ కొనసాగించడమే మేలని అభిప్రాయపడుతున్నట్లు పలు సర్వేలు చెబుతున్నాయి. 

దిల్లీలో కరోనా విజృంభించడంతో ఏప్రిల్‌ 19వ తేదీ రాత్రి 10 గంటల నుంచి ఏప్రిల్‌ 26 వరకు పూర్తి స్థాయి లాక్‌డౌన్‌ విధిస్తున్నట్లు గతంలో సీఎం కేజ్రీవాల్‌ ప్రకటించారు. అయినప్పటికీ కేసుల్లో ఎలాంటి తగ్గుదల లేకపోవడంతో మే 3వ తేదీ వరకు పొడిగించారు. ఆ గడువు సోమవారం ఉదయం 5గంటలకు పూర్తికావడంతో తాజాగా మరో వారం పాటు లాక్‌డౌన్‌ కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 

దేశ రాజధానిలో కరోనా విశ్వరూపం చూపిస్తోంది. రోజుకు దాదాపు 25వేలకు పైగా కొత్త కేసులు వెలుగుచూస్తున్నాయి. వందల మంది వైరస్‌కు బలవుతున్నారు. ఇక దిల్లీలో ఆక్సిజన్‌ కొరత విపరీతంగా ఉంది. ఆసుపత్రుల్లో ఆక్సిజన్‌ నిల్వలు పడిపోవడం, సకాలంలో ప్రాణవాయువు అందకపోవడంతో పదుల సంఖ్యలో రోగుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. కేంద్రం తమకు సరిపడా ఆక్సిజన్‌ కేటాయించకపోవడం వల్లే ఇలాంటి దుర్భర పరిస్థితులు ఎదురవుతున్నాయని ఆమ్‌ ఆద్మీ సర్కారు మండిపడుతోంది.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని