close
Array ( ) 1

తాజా వార్తలు

Published : 20/03/2020 18:35 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

భారత వృద్ధిరేటులో ఫిచ్‌కోత..!

దిల్లీ: ప్రముఖ రేటింగ్‌ సంస్థ ఫిచ్‌ భారత్‌ 2020-21 ఆర్థిక సంవత్సరానికి వృద్ధిరేటులో కోత విధించింది. వ్యాపార పెట్టుబడులు, ఎగుమతులపై కొవిడ్‌-19 ప్రభావం తీవ్రంగా ఉంటుందని పేర్కొంది. ఫలితంగా వృద్ధిరేటు 5.1శాతంగా ఉండొచ్చని అంచనా వేసింది. డిసెంబర్‌లోనే ఫిచ్‌ 2020-21 సంవత్సరానికి 5.6శాతంగా ఆ తర్వాత సంవత్సరం 6.5గా ఉంటుందని అంచనావేసిన సంగతి తెలిసిందే. 

2020లో ప్రపంచవ్యాప్తంగా వారం వారం కరోనా వైరస్‌ పెరిగిపోతోందని ఫిచ్‌ తెలిపింది. కాకపోతే ఈ వ్యాప్తికి కొంత అడ్డుకట్ట వేస్తారని పేర్కొంది. ‘‘సప్లయి చైన్‌లో ఎదురయ్యే అడ్డంకులు వ్యాపార పెట్టుబడులను ప్రభావితం చేస్తాయి. మేము 2020-21లో జీడీపీ వృద్ధిరేటు 5.1గా ఉంటుంది.. 2019-20లో 5శాతం ఉంటుంది. వైరస్‌ వ్యాప్తి సెంటిమెంట్‌ను దెబ్బతీయడంతోపాటు, స్థానిక ప్రభుత్వాలు స్కూల్స్‌, సినిమాహాళ్లు మూసివేత వంటి నిర్ణయాలు తీసుకొంటాయి. భారత్‌కు చైనాకు మధ్య వాణిజ్య, పర్యాటక రంగాల్లో సంబంధాలు ఓ మోస్తరుగా ఉన్నా.. భారత్‌లోని తయారీ రంగానికి చెందిన సంస్థలు చైనా ముడిసరకులపై ఎక్కువగా ఆధారపడుతున్నాయి. ముఖ్యంగా ఎలక్ట్రానిక్స్‌, మిషినరీ, పరికరాల రంగాల్లో ఇది ఎక్కువగా ఉంది’’ అని ఫిచ్‌ పేర్కొంది.  


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.