close

తాజా వార్తలు

Updated : 09/04/2020 04:58 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

అధ్వాన ఆర్థిక సంక్షోభంలోకి ఫ్రాన్స్‌, జర్మనీ

ఫ్రాంక్‌ఫర్ట్‌: కరోనా వైరస్‌ మహమ్మారి ప్రభావంతోఐరోపా సమాఖ్య (ఈయూ)లో అతి పెద్ద రెండు ఆర్థిక వ్యవస్థలైన జర్మనీ, ఫ్రాన్స్‌లు అధ్వాన ఆర్థిక సంక్షోభంలోకి జారుకుంటున్నాయనే అంచనాలు వెలువడుతున్నాయి. దశాబ్దాల నాటి కనిష్ఠ స్థాయిలకు ఆర్థిక వృద్ధి క్షీణించే అవకాశం ఉందని ఆర్థిక వేత్తలు అంచనా వేస్తున్నారు. ఎగుమతుల దేశంగా పేరున్న జర్మనీ 2020 రెండో త్రైమాసికంలో సుమారు 10 శాతం జీడీపీ కోల్పోవచ్చని ఆ దేశంలోని ప్రముఖ పరిశోధన సంస్థలు తాజాగా అంచనా వేశాయి. వార్షిక ప్రాతిపదికన తొలి త్రైమాసికంలో ఇప్పటికే 1.9 శాతం వృద్ధి తగ్గిందని తీవ్రమైన మాంద్యంలోకి జర్మనీ జారుకునే అవకాశం ఉందని ఇఫో, డీఐడబ్ల్యూ, ఆర్‌డబ్ల్యూఐ వంటి పలు ఆర్థిక పరిశోధన సంస్థలు పేర్కొన్నాయి. ఫ్రాన్స్‌ సాంకేతికంగా ఇప్పటికే మాంద్యంలోకి జారుకుందని బ్యాంక్‌ ఆఫ్‌ ఫ్రాన్స్‌ వెల్లడించిన సంగతి తెలిసిందే. అధికారిక గణాంకాల ప్రకారం, 2019 చివరి త్రైమాసికంలో ఆర్థిక వృద్ధి 0.1 శాతం క్షీణించగా, 2020 తొలి త్రైమాసికంలో సుమారు 6 శాతం క్షీణించే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. వరుసగా రెండు త్రైమాసికాల్లో ఆర్థిక వృద్ధి తగ్గితే, ఆ ఆర్థిక వ్యవస్థ మాంద్యంలోకి జారుకున్నట్లే. ఫ్రాన్స్‌ కేంద్ర బ్యాంకు తెలిపిన ప్రకారం, 2020 తొలి త్రైమాసికంలో ఆర్థిక వృద్ధి 1945 తర్వాత కనిష్ఠంగా నమోదు కావడం ఇదే.
అంతర్జాతీయ వాణిజ్యానికీ సెగ: కరోనా వైరస్‌ మహమ్మారి వల్ల 2020లో అంతర్జాతీయ వాణిజ్య వృద్ధి 1/3 వంతు వరకు తగ్గొచ్చని ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీవో) అంచనా వేస్తోంది. క్షీణత 13-32 శాతం మధ్య నమోదు కావొచ్చని తెలిపింది. 2019లోనే అంతర్జాతీయ వాణిజ్యం నెమ్మదించిందని, ఇప్పుడు కరోనా వైరస్‌ వ్యాప్తితో మరింత దారుణ పరిస్థితులు ఏర్పడ్డాయని 164 సభ్య దేశాలున్న డబ్ల్యూటీవో వెల్లడించింది.

 


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని