close

తాజా వార్తలు

Published : 03/08/2020 12:55 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాప్‌ 10 న్యూస్‌ @ 1 PM

1. భారత్‌లో ఆక్స్‌ఫర్డ్‌ టీకా ట్రయల్స్‌కు అనుమతి

ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయం తయారుచేస్తున్న కరోనా వ్యాక్సిన్‌ రెండు, మూడో దశ క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహించేందుకు సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌ఐఐ)కు డ్రగ్స్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా(డీసీజీఐ) అనుమతిచ్చింది. కొవిడ్‌-19పై అధ్యయనం చేస్తున్న నిపుణుల కమిటీ సిఫార్సుల మేరకు ట్రయల్స్‌కు అంగీరిస్తూ డీసీజీఐ వి.జి.సొమానీ ఆదివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసినట్లు ఎస్‌ఐఐ వెల్లడించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. ఏపీ ఎస్‌ఈసీగా మరోసారి నిమ్మగడ్డ బాధ్యతలు..

రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ మరోసారి బాధ్యతలు స్వీకరించారు. హైకోర్టు ఆదేశాలతో ఇటీవలే నిమ్మగడ్డను ప్రభుత్వం పునర్నియమించిన విషయం తెలిసిందే. గవర్నర్‌ నోటిఫికేషన్‌ మేరకు శుక్రవారమే హైదరాబాద్‌లో బాధ్యతలు చేపట్టినట్లు రమేశ్‌కుమార్‌ తెలిపారు. తాను బాధ్యతలు చేపట్టినట్లు కలెక్టర్లు, సంబంధిత అధికారులకు సమాచారమిచ్చినట్లు చెప్పారు. ఎన్నికల సంఘం కార్యదర్శి వాణీమోహన్‌ ద్వారా వీరికి సమాచారమందించినట్లు తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. భార‌త్‌: 18ల‌క్షల కేసులు, 38వేల మ‌ర‌ణాలు!

దేశంలో క‌రోనా వైర‌స్ తీవ్ర‌త అంత‌కంత‌కూ పెరుగుతోంది. నిత్యం 50వేల‌కుపైగా పాజిటివ్ కేసులు బ‌య‌ట‌ప‌డటం ఆందోళ‌న క‌లిగిస్తోంది. తాజాగా నిన్న ఒక్క‌రోజే కొత్త‌గా మ‌రో 52,972 పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. దీంతో దేశంలో మొత్తం కొవిడ్ కేసుల సంఖ్య 18,03,695గా న‌మోదైంది. ఇక మ‌ర‌ణాల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. గ‌డిచిన 24గంట‌ల్లో మ‌రో 771 మంది కొవిడ్ రోగులు మృత్యువాత‌ప‌డ్డారు. దీంతో దేశంలో కొవిడ్ మ‌ర‌ణాల సంఖ్య 38,135కు చేరిన‌ట్లు కేంద్ర ఆరోగ్య‌, కుటుంబ సంక్షేమశాఖ వెల్ల‌డించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* భారత్‌లో 2కోట్లు దాటిన కొవిడ్‌ టెస్టులు!

4. తెలంగాణలో 983 కేసులు.. 11 మరణాలు

తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. కొత్తగా 983 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తాజా బులెటిన్‌లో వెల్లడించింది. అయితే  గత కొన్ని రోజులుగా నిత్యం వెయ్యికిపైగా కేసులు నమోదవుతున్న నేపథ్యంలో నేడు ఆ సంఖ్య కాస్త తగ్గడం ఊరట కలిగించే విషయం. ఇక రాష్ట్రంలో మొత్తం కరోనా కేసులు సంఖ్య 67,660కి చేరింది. మరోవైపు 11 మంది మృతి చెందడంతో మొత్తం ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 551కి పెరిగింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. ‘టిక్‌టాక్‌ కొనుగోలుపై తేల్చేస్తాం’

 చైనాకు చెందిన టిక్‌టాక్‌ యాప్‌ అమెరికా కార్యకలాపాల్ని కొనుగోలు చేయడంపై దాని మాతృసంస్థ బైట్‌డ్యాన్స్‌తో చర్చలు జరుపుతున్నట్లు సాంకేతిక దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్‌ అధికారికంగా ప్రకటించింది. యాప్‌ భద్రతపై వ్యక్తమవుతున్న అనుమానాలపై సంస్థ సీఈవో సత్యనాదేళ్ల ఆదివారం అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌తో చర్చించారు. యాప్‌ పనితీరు విషయంలో ట్రంప్‌ లేవనెత్తిన ఆందోళనలపై విస్తృతంగా చర్చించినట్లు సంస్థ ఓ ప్రకటనలో వెల్లడించింది. అమెరికా సహా కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లోనూ యాప్‌ కార్యకలాపాల్ని సొంతం చేసుకునేందుకు యోచిస్తున్నట్లు తెలిపింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. కేటీఆర్‌కు రాఖీ కట్టిన కవిత

 అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల అనుబంధానికి ప్రతీకగా నిలిచే రక్షాబంధన్‌ వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్నాయి. కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ సోదరీమణలు.. తమ సోదరులకు రాఖీలు కడుతున్నారు. రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌కు ఆయన సోదరి కవిత ప్రగతిభవన్‌లో రాఖీ కట్టారు. పండగ శుభాకాంక్షలు తెలిపిన కవిత.. తన సోదరుడి నుంచి ఆశీర్వాదాలు తీసుకున్నారు. అనంతరం రాజ్యసభ సభ్యుడు సంతోష్‌కుమార్‌కు కవిత రాఖీ కట్టి మిఠాయి తినిపించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. మహిళల ఆశీస్సులతోనే దేశ పురోగతి: మోదీ

భారతదేశ అభివృద్ధి, పురోగతికి నారీశక్తి ఆశీస్సులు ఎంతో అవసరమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఈ దేశ మహిళల ఆశీర్వాదాలే తనకి బలాన్నిస్తున్నాయని అభిప్రాయపడ్డారు. నేడు రక్షాబంధన్‌ని పురస్కరించుకొని ఆయనకు శుభాకాంక్షలు తెలిపిన మాతా అమృతానందమయికి కృతజ్ఞతలు తెలుపుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అంతకుముందు దేశ ప్రజలకు ఆయన రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. స్థిరాస్తి వ్యాపారి ఇంట్లో భారీ చోరీ

మేడ్చల్ జిల్లా కుషాయిగూడ సైనిక్‌పురిలోని ఓ స్థిరాస్తి వ్యాపారి ఇంట్లో భారీ చోరీ జరిగింది. ఇంట్లో లాకర్‌ పగులగొట్టి బంగారు నగలు, వజ్రాలు, నగదును దొంగలు దోచుకెళ్లారు. కుమారుడి వివాహం సందర్భంగా  రియల్టర్ నర్సింహారెడ్డి కుటుంబం షిర్డీ వెళ్లి వచ్చింది. తిరిగి వచ్చేసరికి ఇంట్లోని విలువైన వస్తువులు చోరీకి గురైనట్లు గుర్తించారు. సుమారు రూ.2 కోట్ల విలువైన సొత్తు ఎత్తుకెళ్లినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంట్లోని పనిమనుషులు కనిపించకపోవడంతో వారిపై స్థిరాస్తి వ్యాపారి అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. కడప జిల్లాలో శానిటైజర్‌ తాగి ముగ్గురి మృతి

ప్రకాశం జిల్లాలోనే కాదు.. కడప జిల్లాలోనూ మత్తు కోసం మందుబాబులు శానిటైజర్‌ తాగి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.  కడప జిల్లా పెండ్లిమర్రిలో శానిటైజర్‌ తాగి ముగ్గురు మృతి చెందారు. నిన్న శానిటైజర్‌ తాగిన ఇద్దరు వ్యక్తుల్లో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా.. మరొకరు రిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. ఈ రోజు ఉదయం ఇంటి వద్ద మరొకరు చనిపోయారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. నటి కరీనా కపూర్‌ పారితోషికం ఎంతో తెలుసా?

చాలా మంది హీరోయిన్లకు ఎంత క్రేజ్‌ ఉన్నా వివాహం చేసుకున్నాక డిమాండ్‌ కాస్త తగ్గుతుందనేది చిత్రవర్గాల మాట. వెండితెరపై ఒక వెలుగు వెలిగిన నటీమణులు వివాహం చేసుకొని సినిమాలకు దూరం కావడమో.. లేదా సహాయక పాత్రల్లో నటించడమో చేస్తుంటారు. కానీ కరీనా కపూర్ అందుకు భిన్నం. వివాహమైనా కరీనా కపూర్‌ ఇమేజ్ ఏ మాత్రం తగ్గలేదు. అందుకు తగ్గట్టే భారీగా పారితోషికం తీసుకుంటోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.