close
Array ( ) 1

తాజా వార్తలు

Published : 01/07/2020 08:58 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాప్‌ 10 న్యూస్‌ @ 9 AM

1. లాక్‌డౌన్‌పై ఏం చేద్దాం...

కరోనా నియంత్రణ కోసం రాజధానిలో లాక్‌డౌన్‌ సహా పలు కీలక నిర్ణయాలు తీసుకునేందుకు వీలుగా నిర్వహించనున్న మంత్రిమండలి సమావేశంపై బుధవారం స్పష్టత రానుంది. లాక్‌డౌన్‌ను దృష్టిలో పెట్టుకునే రాష్ట్ర ప్రభుత్వం ఎంసెట్‌ సహా ప్రవేశ పరీక్షలను వాయిదా వేసినట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ మంగళవారం రోజంతా పలువురు మంత్రులు, నేతలు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌, ఇతర ఉన్నతాధికారులతో చర్చించి, వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. అంతటా ఏ2ఏ వైరస్‌

కరోనా వ్యాప్తి గురించి కొత్త విషయాలు వెల్లడవుతున్నాయి. ఇదివరకు పరిశోధనల్లో భారత్‌లో ప్రత్యేకమైన వైరస్‌ సమూహం ఎక్కువగా ఉన్నట్లు గుర్తించినా.. రెండు నెలలు తిరిగే సరికే ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా వ్యాపిస్తున్న వైరస్‌ సమూహమే మనదేశంలోనూ విస్తరిస్తోందని శాస్త్రవేత్తలు గుర్తించారు. వెయ్యికిపైగా వైరస్‌ నమూనాల జన్యుక్రమాలను కనుగొన్న తర్వాత ఈ అంచనాకు వచ్చారు. సెంటర్‌ ఫర్‌ సెల్యులర్‌ అండ్‌ మాలిక్యులర్‌ బయాలజీ (సీసీఎంబీ)కి చెందిన బయో ఇన్ఫర్మేటిక్స్‌ సెంటర్‌ పరిశోధన ఫలితాలను విశ్లేషించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

92శాతం మంది మృత్యుంజయులే

3. డ్రాగన్‌తో ఢీ అంటే టీ

భారీ యుద్ధ ట్యాంకులు.. మైదాన ప్రాంత పోరాటాల్లో రారాజులు. అయితే శీతల, పర్వతమయ ప్రాంతాల్లో వాటికి స్థానం లేదు. భారంగా.. గంటకు 50 కిలోమీటర్ల కన్నా తక్కువ వేగంతో కదిలే ఈ శకటాలు ప్రతికూల వాతావరణంలో మెరుగ్గా పోరాడలేవు. పైగా వాటిని అక్కడికి తరలించడమూ కష్టమే. అందుకే అలాంటి ప్రాంతాల్లోకి వాటిని పంపే ఆలోచనను సైన్యాలు చేయవు. భారత సైన్యం దీన్ని మార్చేసింది. సరిహద్దుల్లో చైనాకు ముకుతాడు వేయాలన్న దృఢ నిశ్చయంతో ప్రధాన యుద్ధ ట్యాంకులైన టి-72, టి-90లను కొన్నేళ్ల కిందటే తూర్పు లద్దాఖ్‌కు తరలించింది. ఇప్పుడు అవి డ్రాగన్‌పై గర్జించడానికి సిద్ధంగా ఉన్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. నిర్ధారణ పరీక్ష.. గగనమే!

దేవుడు వరమిచ్చినా పూజారి కనికరించలేదన్నట్లుగా హైదరాబాద్‌లో కరోనా అనుమానితుల పరిస్థితి ఉంది. వైరస్‌ నిర్ధారణ కోసం ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశం మేరకు రాజధాని పరిధిలో ఏర్పాటు చేసిన నమూనాల సేకరణ కేంద్రాలు మూణ్నాళ్లకే మూతపడ్డాయి. సాంకేతిక కారణాలతో వీటిని 4 రోజులు మూసి వేస్తున్నామని తిరిగి తెరుస్తామని ప్రకటించిన వైద్య ఆరోగ్య శాఖ వారం అవుతున్నా ఈ కేంద్రాలను తిరిగి తెరవలేదు. దీంతో కొవిడ్‌ అనుమానిత లక్షణాలతో బాధపడుతున్నవారు పరీక్షలు చేయించుకోవాలంటే అష్టకష్టాలు పడుతున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. వ్యాక్సిన్‌ తొలుత ఆరోగ్య సిబ్బందికే

దేశంలో కరోనా వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చిన వెంటనే దానిని తొలుత ఆరోగ్య సిబ్బందికే అందించాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధికారులకు సూచించారు. వారంతా కరోనాపై ముందుండి పోరాడుతున్నారని గుర్తుచేశారు. వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చిన వెంటనే ఎవరెవరికి దాన్ని ప్రాధాన్య క్రమంలో అందించాలన్న అంశంపై ఆయన మంగళవారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. భారత్‌లాంటి అధిక జనాభా ఉన్న దేశంలో విభిన్న అంశాలను పరిగణనలోకి తీసుకొని వ్యాక్సిన్‌ అందించాలని సూచించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. అమరరాజా భూములు వెనక్కి

తెదేపా ఎంపీ గల్లా జయదేవ్‌ కుటుంబానికి చెందిన అమరరాజా ఇన్‌ఫ్రాటెక్‌ (ప్రైవేట్‌) సంస్థకు వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి హయాంలో కేటాయించిన 253.6 ఎకరాల్ని రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. ఈ మేరకు ఏపీఐఐసీకి అనుమతిస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. వైఎస్‌ ప్రభుత్వ హయాంలో (2009) చిత్తూరు జిల్లాలోని బంగారుపాళ్యం, యాదమర్రి మండలాల్లోని నూనెగుండ్లపల్లి, 108-మహారాజా కొత్తపల్లి గ్రామాల పరిధిలో అమరరాజా కంపెనీకి మొత్తం 483.27 ఎకరాలను ఏపీఐఐసీ కేటాయించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

పారిశ్రామిక విధానం మూడేళ్లే

7. కర్నూలు, కృష్ణాల్లో.. కరోనా కల్లోలం!

కరోనా కాఠిన్యానికి కర్నూలు, కృష్ణా జిల్లాలు మరింతగా తల్లడిల్లుతున్నాయి. ఓ పక్క పాజిటివ్‌ కేసులు, మరోపక్క మరణాలు నానాటికీ పెరుగుతూనే ఉన్నాయి. రాష్ట్రంలోకెల్లా అత్యధిక కరోనా మృతులు ఈ జిల్లాల వారే. రోజువారీ నమోదవుతున్న మరణాలూ ఇక్కడే అధికం. ఈ రెండు చోట్లా కరోనా మరణాల రేటు జాతీయ సగటును మించడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. ఉన్నదీ పోయే వచ్చేదీ పోయే..

భారత్‌లో బహుళ ప్రజాదరణ పొందిన చైనా యాప్‌ల్లో తొలుత గుర్తొచ్చేది టిక్‌టాక్‌. ప్రపంచవ్యాప్తంగా టిక్‌టాక్‌ డౌన్‌లోడ్లలో భారత్‌ నుంచి దాదాపు 30 శాతం ఉంటాయి. భారత్‌లో ఇప్పటివరకు టిక్‌టాక్‌ డౌన్‌లోడ్లు 61 కోట్ల వరకు నమోదైనట్లు గణాంకాలు చెబుతున్నాయి. అందుకే భారత్‌ విపణికి టిక్‌టాక్‌ అత్యంత ప్రాధాన్యం ఇస్తూ వస్తోంది. టిక్‌టాక్‌ మాతృసంస్థ బైట్‌ డాన్స్‌ ఇప్పటికే భారత్‌లో 10 కోట్ల డాలర్లను పెట్టుబడిగా పెట్టింది. మరో 100 కోట్ల డాలర్లను పెట్టుబడిగా పెట్టే యోచనలోనూ ఉంది. కొత్తగా 1000 నియామకాలను చేపట్టేందుకూ సిద్ధమైంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. నిశ్శబ్ద ఐటీ నగరి..!

అద్దాల మేడలు.. రంగురంగుల విద్యుద్దీపాలు.. రద్దీ రహదారులు.. రాత్రి, పగలు తేడా తెలియని వాతావరణం.. నగరమంతా నిద్దురపోతున్నా ఏదో ఓ పనితో ఎప్పుడూ తీరిక లేకుండా మేలుకుని ఉండే ప్రాంతం.. ఇదీ ఐటీ నగరం గుర్తొస్తే మన కళ్ల ముందు మెదిలే చిత్రం. కానీ ప్రస్తుతం దాని రూపు మారిపోయింది. ఒకప్పుడు కాలు పెడితే కదపలేని దారులన్నీ ఇప్పుడు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. ఎప్పుడూ ఉద్యోగులతో కళకళలాడే ఐటీ ప్రాంగణాలు ఇప్పుడు నిర్మానుష్యంగా మారాయి. కొవిడ్‌-19 కారణంగా మార్చి నెలలో లాక్‌డౌన్‌తో ఖాళీ అయిన ఐటీనగరం.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. ఆమె అగుపించట్లేదు

లింగ వివక్ష, భ్రూణహత్యల కారణంగా గత యాభై ఏళ్లలో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 14.26 కోట్ల మంది మహిళలు జనాభా లెక్కల్లోంచి అదృశ్యమయ్యారని.. అందులో భారత్‌ నుంచే 4.58 కోట్ల మంది ఉన్నారని ఐక్యరాజ్య సమితి మంగళవారం విడుదల చేసిన ప్రపంచ జనాభా నివేదిక-2020 పేర్కొంది. ఈ విషయంలో చైనా అగ్రస్థానంలో ఉంది. ఆ దేశంలో 7.23 కోట్ల మంది మహిళలు మాయమయ్యారు. ఈ అదృశ్యమైన మహిళంతా భ్రూణహత్యలకు, లింగ వివక్షకు గురై జనాభాల లెక్కల్లో లేకుండా పోయారని నివేదిక తెలిపింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.