కోహ్లీ.. నన్ను జట్టులోకి తీసుకుంటావా?
close

తాజా వార్తలు

Published : 29/11/2020 00:52 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కోహ్లీ.. నన్ను జట్టులోకి తీసుకుంటావా?

ఇంటర్నెట్‌డెస్క్‌: ఇంగ్లాండ్‌ స్టార్‌ ఫుట్‌బాల్‌ ఆటగాడు హ్యారీ కేన్‌ టీమిండియా కెప్టెన్, బెంగళూరు సారథి విరాట్ కోహ్లీని ఉద్దేశిస్తూ ట్వీట్ చేశాడు. తమ జట్టు ఆటగాళ్లతో సరదాగా క్రికెట్ ఆడిన వీడియోను హ్యారీ పోస్ట్ చేశాడు. ‘‘టీ20 మ్యాచ్‌లో విజయం సాధించడానికి కావాల్సిన బ్యాటింగ్‌ నైపుణ్యాన్ని సంపాదించా. వచ్చే ఏడాది ఐపీఎల్ సీజన్‌లో ఆర్‌సీబీ జట్టులో నాకు స్థానం ఉంటుందా?’’ అని దానికి వ్యాఖ్యను జత చేస్తూ కోహ్లీని ట్యాగ్ చేశాడు. ఈ వీడియోలో ఇంగ్లాండ్ గోల్‌కీపర్ జో హార్ట్ బౌలింగ్ చేస్తుండగా హ్యారీ బ్యాటింగ్ చేశాడు. కొన్ని షాట్లు దూకుడుగా ఆడిన అతడు చివరికి బౌల్డ్ అయ్యాడు.

అయితే కోహ్లీ ఈ ట్వీట్‌కు రిప్లై ఇచ్చాడు. ఎటాకింగ్ బ్యాట్స్‌మన్‌గా పరిగణించి హ్యారీని జట్టులోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయని సరదాగా బదులిచ్చాడు. ‘‘చక్కని నైపుణ్యం. ఎటాకింగ్ బ్యాట్స్‌మన్‌గా నిన్ను జట్టులోకి తీసుకోవచ్చు’’ అని నవ్వుతున్న ఎమోజీలను జోడించి కోహ్లీ రీట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ నెట్టింట్లో వైరల్‌గా మారింది. కాగా, ప్రస్తుతం కోహ్లీ ఆస్ట్రేలియా సుదీర్ఘ పర్యటనలో ఉన్నాడు. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఆదివారం ఆసీస్‌తో రెండో మ్యాచ్‌ ఆడనున్నాడు. తొలి మ్యాచ్‌లో భారత్ 66 పరుగుల తేడాతో ఓటమిపాలైన సంగతి తెలిసిందే.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని